GK And Current Affairs Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్' కు సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి.
1. 'సూభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్' అను అవార్డును కేంద్ర ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2. విపత్తు నిర్వహణకు సంబంధించిన విషయాలలో నిష్ణాతులైన భారత పౌరులు మరియు సంస్థలు ఈ అవార్డుకు అర్హులు.
3. నేషన్స్ డిజాస్టర్ రెస్సాన్స్ పోర్స్ (NRDL) వారి 8వ ఇటాలియన్, ఘజియాబాద్ వారిని 2019 వ సంవత్సరానికి గాను ఈ అవార్డును ఎంపిక చేసారు.
సరియైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయండి.

A)1 మరియు 2 మాత్రమే
B)2 మరియు 3 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)1 మాత్రమే

View Answer
B)2 మరియు 3 మాత్రమే

Q)'వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు' కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి.
1. 180 కి.మీ. వేగంతో నడిచే ఈ ఇంజన్ లేని రైలు భారతదేశంలో అత్యంత వేగవంతమైనది.
2. ఈ రైలును సాధారణంగా 'టైయిన్ 180' అని అంటారు.
3. ఈ రైలు ఢిల్లీ-వారణాసి ల మధ్య నడుపబడుతుంది.
సరియైన వ్యాఖ్య (ల)ను ఎంపిక చేయండి.

A)1,2 మరియు 3
B)1 మరియు 2 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)3 మాత్రమే

View Answer
C)1 మరియు 3 మాత్రమే

Q)'కలాంసాట్-వి2' కు సంబంధించి కింది జతలను చదవండి
1. కలాంసాట్-వి2 ఉపగ్రహం : ప్రపంచం యొక్క అతి తేలికైన ఉపగ్రహం
2. ఉపగ్రహపు బరువు : 2.6 కి.గ్రా.
3. ఉపగ్రహాన్ని రూపొందించిన వారు : స్పేస్ కిడ్స్ ఇండియా విద్యార్థులు
సరియైన జత(ల)ను ఎంపిక చేయండి

A)1,2 మరియు 3
B)1 మరియు 2 మాత్రమే.
C)2 మరియు 3 మాత్రమే .
D)1 మరియు 3 మాత్రమే

View Answer
D)1 మరియు 3 మాత్రమే

Q)అటవీ జంతువుల వలస జాతుల పరిరక్షణపై ఫిబ్రవరి 2020లో జరపతల పెట్టబడిన 13వ 'కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీల' (COP) సమావేశం/ కన్వెన్షన్ ఎక్కడ జరుగుతుంది?

A)హైదరాబాద్, తెలంగాణ
B)గాంధీనగర్, గుజరాత్
C)బెంగుళూరు, కర్ణాటక .
D)అమరావతి, ఆంధ్రప్రదేశ్

View Answer
B)గాంధీనగర్, గుజరాత్

Q)US ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేసిన 2019 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో, 50 దేశాలలో భారతదేశపు ర్యాంకు ఎంత?

A)50
B)44
C)43
D)36

View Answer
D)36

Q)2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)వారి (పురుషుల) క్రికెట్ అవార్డ్స్ లో విరాట్ కోహ్లికి కింది వాటిలో ఏయే పథకాలు ప్రదానం చేయబడ్డాయి?
1. అంతర్జాతీయ T20 లో 2018 సంవత్సరపు అత్యుత్తమ ప్రదర్శన
2. ICC 2018 సంవత్సరపు ODI ప్లేయర్ .
3. ICC2018 సంవత్సరపు పురుషుల టెస్ట్ ప్లేయర్
4. 2018 సంవత్సరపు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ICC క్రికెటర్ ట్రోఫీ .
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

A)1,2 మరియు 3 మాత్రమే
B)2,3 మరియు 4 మాత్రమే
C)1 మరియు 4 మాత్రమే
D)1,2,3 మరియు 4

View Answer
B)2,3 మరియు 4 మాత్రమే

Q)క్రింది నాలుగు ప్రధాన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లను క్యాలెండర్ ప్రకారం వరుస క్రమంలో అమర్చండి
1. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్
2. యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్
3. రోలండ్ గా రోస్ టెన్నిస్ టోర్నమెంట్
4. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ .
సరియైన క్రమాన్ని ఎంపిక చేయండి.

A)4,2,3,1
B)2,1,3,4
C)3,4,1,2
D)4,3,1,2

View Answer
D)4,3,1,2
Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!