81) మీరు ఎరుపులైటు ముందు నిర్ణీతగీత లోపల నిలవాలి ?
ఎ) ఎందుకంటే జనసంచారం స్పష్టంగా కన్పిస్తుంది.
బి) ఎందుకంటే తక్కినవాళ్ళకు కూడా జనసంచారం స్పష్టంగా కనిపిస్తుంది.
సి) పాదాచారులు జీబ్రాలైనులో రోడ్డు దాటుటకు వీలుకలుగుతుంది.
డి) పచ్చలైటు వెలగగానే అందరూ కలిసి వెళ్లేలా చూడండి.
82) మీరు కూడలి వద్దకు చేరగానే ట్రాఫిక్ లైటు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మారింది అప్పుడు మీరు ?
ఎ) వెంటనే వేగాన్ని పెంచుతారు.
బి) హారన్ వాయిస్తూ వెళ్ళిపోతారు.
సి) వేగాన్ని తగ్గించి నిలబడతారు.
డి) ఈవేవి కావు.
83) పసుపు పచ్చరంగులైటును ఎప్పుడు ఫ్లాష్ చేస్తారు ?
ఎ) ట్రాఫిక్ లైట్లు పనిచేయనప్పుడు.
బి) రోడ్డు మరమ్మత్తు చేస్తున్నప్పుడు.
సి) మీరు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్ళవలసినప్పుడు.
డి) మీరుకూడా మీ హెడ్ లైట్ల ఫ్లాష్ చేయవలసినప్పుడు.
84) ఎరుపు లైటును ఫ్లాష్ చేస్తే అర్థమేమిటి?
ఎ) ముందు ప్రమాదమున్నది.
బి) ఇతరవాహనాలు, పాదాచారులు రోడ్డు దాటే వరకు ఆగాలి.
సి) ట్రాఫిక్ లైట్లు పని చేయడంలేదు.
డి) పైవేవి కాదు.
85) రోడ్డు మీద ఒక్క సింగిల్ సాలిడ్ లైను ఉన్నధి (బలమైన నిలువు లైను) ఇది తెలియజేస్తుంది….?
ఎ) ఓవర్ టేక్ చేయమని
బి) లైను దాటమని.
సి) లైను దాటకూడదని.
డి) ఎడమవైపుకు తిరగమని.