101) మీరు రోడ్డు ప్రక్కగా రావాలనుకుంటారు. అప్పుడు మోటారు సైకిళ్ళను జాగ్రత్తగా ఎందుకు గమనిస్తారు?
ఎ) మోటారు సైకిళ్ళు చిన్నవి గనక చూడ్డం కష్టం.
బి) సాధారణంగా మోటారు సైకిళ్లు కార్లకంటే వేగంగా వెళ్తాయి.
సి) పోలీసు గస్తీదళాలు తరచుగా మోటారు సైకిళ్లను ఉపయోగిస్తారు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
102) కారు డ్రైవర్లకంటే మోటారు సైకిళ్ళు నడుపువారు ఎక్కువ ప్రమాదాలకు లోనవుతారు ఎందుకు ?
ఎ) వేగంగా నడుపుతారు.
బి) వేగంగా మలుపు తిప్పుతారు.
సి) కార్లకంటే వేగంగా వేగం పుంజుకుంటారు.
డి) పైవేవి కాదు.
103) నడిరోడ్డుపై మీరు ఒక లారీ వెనక వెళ్తున్నప్పుడు నీటి తుంపరల వల్ల దారి కనిపించడం కష్టం అవుతుంది అప్పుడు?
ఎ) దారి స్పష్టంగా కనిపించేంతవరకు వెనక్కి తగ్గండి.
బి) హెడ్ లైట్లను ప్రకాశవంతంగా వెలిగించండి
సి) లారీకి దగ్గరగా కానీ నీటి తుంపరకు దూరంగా ఉండండి.
డి) వేగాన్ని పెంచి ఓవర్ టేక్, చేయండి.
104) మీరు లైటు వెలిగించి వర్షంలో ఇతర వాహనాలు వెనకల ప్రయాణిస్తున్నారు. మీరు ప్రమాదాలను ఎలా నివారించగలుగుతారు?
ఎ) వేగాన్ని తగ్గించి వాహనాల మధ్య దూరం పెంచడం వలన.
బి) ముందున్న వాహనానికి అతి దగ్గరగా వుండడం వలన.
సి) హెడ్ లైట్లకు బదులు డిప్పర్ లైట్లు వెలిగించడం వలన.
డి) ఇతర వాహనాలతో పాటు వేగంగా నడపడం వలన.
105) వర్షంలో ఎందుకు వేగాన్ని తగ్గించి నడుపుతారు ?
ఎ) ముందు దారి స్పష్టంగా కనబడక.
బి) బ్రేకులు సరిగ్గా పనిచేయవు కనుక.
సి) ఇతరుల లైట్లు మసకగా ఉంటాయి కనుక.
డి) ఇంజను చల్లబడుతుంది కనుక.