106) మీరు వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనానికి ఎక్కువ దూరంగా ఎందుకుండాలి?
ఎ) అది అకస్మాత్తుగా ఆగవచ్చు.
బి) అది అకస్మాత్తుగా మలుపు తిరగవచ్చు.
సి) దాని మసక వెలుతురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
డి) దాని బ్రేక్ లైట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
107) మీరు పొగమంచులో నడుపుతున్నప్పుడు 100 మీటర్లకంటే ఎక్కువ ముందుకు చూడగలుగుతున్నారు. వెనక నున్న డ్రైవర్లు మిమ్మల్ని చూడగలుగుతున్నారని ఎలా నిర్ధారించుకుంటారు?
ఎ) హెడ్ లైట్లు వెలిగించి.
బి) ముందు వెళ్తున్న వాహనాన్ని దగ్గరగా అనుసరిస్తూ,
సి) వెనకనున్న మసకలైట్లను వెలిగించి.
డి) రోడ్డు మధ్యలో నడుపుతూ.
108) రాత్రిళ్ళు ఓవర్టేకింగ్ చేసేటప్పుడు ఈ క్రింది వాటిల్లో ఏది సరైన పద్దతి ?
ఎ) ఎక్కువ దూరం చూడలేరు కనుక జాగ్రత్తగా ఉండడం.
బి) మలుపు తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండడం.
సి) మలుపు దగ్గర ఆగి ఎదురు లైట్లను గమనించడం.
డి) బయలుదేరేముందు రెండుసార్లు హారన్ వాయించడం.
109) మీరు రాత్రిపూట కారును ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడు గమనించవలసినవి?
ఎ) ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకండి.
బి) ఓవర్ టేక్ చేసేముందు హెడ్ లైట్లను ఆర్పి వెలిగించండి.
సి) వెనకాల లైట్లను వెలిగించండి.
డి) ఓవర్ టేక్ చేసేముందు హెడ్ లైట్లను ప్రకాశవంతంగా వెలిగించండి
110) మీరు గుండ్రటి మలుపులో నేరుగా వెళుతున్నారు. ఎలా సంకేతాన్నిస్తారు?
ఎ) ప్రస్తుత రోడ్డు వదిలి కొత్త రోడ్డుకి వెళ్ళేలోపు ఎడమవైపునకు సిగ్నల్ ఇవ్వవలెను.
బి) మలుపులోకి వెళ్ళిన వెంటనే కుడివైపునకు సిగ్నల్ ఇచ్చి తర్వాత ఎడమవైపుకు ఇవ్వవలెను.
సి) మలుపుదాటునపుడు ఎడమవైపు సిగ్నల్ ఇవ్వవలెను.
డి) మలుపు ముందరనుండి మలుపు దాటువరకు ఎడమవైపునకు సిగ్నల్ ఇవ్వవలెను.