111) రోడ్డు సూచికలు, గుర్తులు లేని కూడలికి రెండు వాహనాలు వచ్చినచో దేనికి ప్రాధాన్యత వుంటుంది ?
ఎ) దేనికి లేదు
బి) ముందుగా వేగముగా ఉన్న వాహనం.
సి) ప్రధానమైన వెడల్పు మార్గం గుండా వస్తున్న వాహనం.
డి) కుడివైపునుండి వస్తున్న వాహనం
112) వాహనములు నడుపుట నేర్చుకోనేవారు?
ఎ) చెల్లుబాటులో ఉన్న లెర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
బి) నిపుణుల సూచనలు పాటించాలి.
సీ) హెడ్ లైట్లకు బదులు డిప్పర్ లైట్లు వెలిగించడం వలన.
డి) ఇతర వాహనాలతో పాటు వేగంగా నడపడం వలన.
113) డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే వరకు మీరు తప్పకుండా ?
ఎ) వాహనము పై ఎర్ర యల్ బోర్డు ప్రదర్శించాలి.
బి) వాహనముపై ఆకుపచ్చ యల్ బోర్డు ప్రదర్శించాలి.
సి) నిపుణుల పర్యవేక్షణలోనే వాహనాన్ని నడపాలి.
డి) పైవేవి కాదు.
114) మీరు వాహనము నేర్చుకుంటున్నవారు, ఒక వ్యక్తిని కూర్చుండబెట్టుకోవడానికి చట్టం ఎప్పుడు అనుమతిస్తుంది ?
ఎ) మీరు డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై లైసెన్స్ పొందినప్పుడు.
బి) 125 సి.సి మించని వాహనమైనప్పుడు.
సి) కూర్చున్న వ్యక్తికి లైసెన్స్ ఉండి మీకు శిక్షణ ఇస్తూ ఉంటే.
డి) మీకు మూడు సంవత్సరాల అనుభవం ఉంటే.
115) డ్రైవింగ్ పరీక్షకి మీరు వెళుతుంటే మీ వెంట ఉండవలసినవి?
ఎ) లర్నింగ్ లైసెన్స్
బి) వాహన రిజిస్ట్రేషన్ పత్రము.
సి) వాహన, భీమా పత్రము.
డి) పైవన్నీ