136) మీరు ఎడమవైపు నుండి ఓవర్‌టేక్ చేయవచ్చును ?
ఎ) ముందున్న డ్రైవర్ కుడివైపునుండి దారి ఇవ్వనప్పుడు.
బి) అన్ని సమయాల్లో ముందున్న వాహనం కుడివైపు
సి) సంకేతం ఇచ్చి తిరుగుతున్నప్పుడు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
137) ఒక వాహనమును మీరు వెనుక నుండి ఓవర్‌టేక్ చేయవలెనని అనుకున్నప్పుడు
ఎ) ఎడమవైపునుండి ఓవర్‌టేక్ చేయవచ్చును.
బి) కుడివైపునుండి ఓవర్‌టేక్ చేయవచ్చును.
సి) ముందున్న వాహనం కుడివైపు తిరుగుటకు సూచికవచ్చిన ఎడమవైపు నుండి ఓవర్‌టేక్ చేయవచ్చును.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
138) మీరు ఓవర్‌టేక్ చేయవచ్చును ?
ఎ) మలుపులో మరియు కొండమార్గాన.
బి) రోడ్డు స్పష్టంగా కనిపించనప్పుడు.
సి) ముందున్న డ్రైవర్ ఓవర్ టేక్ చేయుటకు సమ్మతించనప్పుడు.
డి) పైవేవి కాదు.
139) రాత్రివేళలో వాహనము నడిపించుట?
ఎ). మంచిదే ఎందుకంటే జనసమ్మర్థం తక్కువ ఉంటుంది.
బి) జనసమ్మర్థం తక్కువగా ఉండును కావున వేగంగా నడపవచ్చును.
సి) ప్రమాదకరం ఎందుకంటే చీకటిగా ఉంటుంది.
డి) పైవేవి కాదు.
140) రాత్రివేళల్లో వాహనాన్ని నడిపినప్పుడు?
ఎ) సైకిల్ నడుపువారితో, పాదాచారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
బి) సైకిల్ నడుపువారితో, పాదాచారులు రాత్రి వేళల్లో ఉండరు.
సి) మీ గమ్యస్థానాన్ని తొందరగా చేరవచ్చును.
డి) పైవేవి కాదు.