26) రోడ్డుపై మీ వాహనము పంక్చర్ అయినపుడు ఏం చేయాలి ?
ఎ) వెంటనే ప్రక్కకు తీసుకోవాలి
బి) నెమ్మదిగా నడుపుతూ, మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్ళాలి.
సి) ప్రక్కగా పెట్టి సాధ్య మైనంత తొందరగా టైరును మార్చాలి.
డి) ప్రమాద సూచికను లైట్లను వెలిగించి వాహనమును ఆపాలి.
27) మీ పాదాన్ని క్లచ్ పై పెట్టివుంచడం వలన.
ఎ) ఇందనం వృధా ఖర్చు
బి) క్లచ్ ప్లేట్ల అరుగుదల
సి) మెరుగైన డ్రైవింగ్
డి) ఇందనం వృధా ఖర్చు & క్లచ్ ప్లేట్ల అరుగుదల
28) అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఆకస్మాత్తుగా ఆపాల్సివచ్చినప్పుడు ఏం చేయాలి?
ఎ) మొదటి నుండే వేగంగా వెళ్ళకపోవడం
బి) హ్యాండ్ బ్రేకును ఉపయోగించడం
సి) ట్రాఫిక్ ను పట్టించుకోకుండా వెంటనే ముందు, వెనుక బ్రేకులను ఉపయోగించడం.
డి) పైన పేర్కొన్న కారణాలు కాకుండా మరేవైనా
29) మీ ముందు ఒక బస్సు ఆగి ప్రయాణికులను దించి ఎక్కించు కుంటున్నప్పుడు మీరు..?
ఎ) వెనక ఒపికగా వేచి ఉండాలి.
బి) ఎడమవైపునుంచి బస్సును దాటి వెళ్ళాలి.
సి) కుడివైపునుండి బస్సును దాటాలి.
డి) పైన పేర్కొన్న కారణాలు కాకుండా మరేవైనా
30) వర్షం కురుస్తున్నప్పుడు పాదాచారులను జాగ్రత్తగా గమనించాలి, ఎందుకుంటే?
ఎ) వర్షంలో సరదాగా అటు ఇటు పరుగెత్తవచ్చు
బి) తడుస్తామనే కంగారులో వాహనాలను చూడకుండా సురక్షిత స్థలానికై పరుగెత్తవచ్చు.
సి) జారుడు రోడ్డు పై మీరు జాగ్రత్తగా గమినించకపోవచ్చు.
ఢి) పైన పేర్కొన్న కారణాలు కాకుండా మరేవైనా