41) పగలు ఏ పరిస్థితుల్లో మీరు డిమ్ చేసిన హెలైట్లను వెలిగిస్తారు?
ఎ) సరిగ్గా దారి కనిపించనప్పుడు
బి) సాధారణ రోడ్డు పైన
సి) ఇరుకు వీధుల్లో
డి) పార్కింగ్ చేసినప్పుడు
42) ఎక్కడికైనా వెళ్ళాలి కాని అనారోగ్యంగా ఉంది, అప్పుడు మీరు.. ?
ఎ) అసలు డ్రైవింగ్ చేయ్యరు.
బి) డ్రైవింగ్ కు ముందు అవసరమైన మందులు వాడతారు.
సి) తక్కువ దూరం ప్రయాణిస్తారు.
డి) రాత్రి తొందరగా తిరిగి వస్తారు.
43) రోడ్డు ప్రక్కనున్న వాహనము మీ ముందు కొచ్చినప్పుడు అకస్మాత్తుగా మీరు బ్రేకు వేస్తారు అప్పుడు మీరు ?
ఎ) ఆ డ్రైవర్‌ను మన్నించి శాంతంగా అతన్ని వెళ్ళనిస్తారు.
బి) మీ ఉనికిని తెలియజేయడానికి లైట్లను ఫ్లాష్ చేస్తారు. .
సి) మీ ఉనికిని తెలియజేయడానికి హారన్ వాయిస్తారు.
డి) సాధ్యమైనంత తొందరగా ఓవర్టేక్ చేస్తారు.
44) మీరు ప్రయాణిస్తున్న ప్రధాన రోడ్డుకు ‘ఇరువైపుల మరిన్ని రోడ్లు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి?
ఎ) ప్రక్క రోడ్డు నుండి వస్తున్న వాహనాన్ని సరిగ్గా చూడలేకపోవచ్చు.
బి) ప్రక్కనుండి వీస్తూన్నగాలి మీ వేగాన్ని తగ్గించవచ్చు.
సి) వాహనం మలుపు తిరిగేటప్పుడు పట్టు తప్పిపోవచ్చు.
డి) కూడలిలోకి ప్రవేశించే వాహనాలు నెమ్మదిగా రావచ్చును.
45) రోడ్డు ప్రక్కగా వాహనములు నిలిపి ఉన్న మార్గముగుండా వెళుతూ ఒక బంతి గెంతులారావడం చూస్తారు. అప్పుడేం చేస్తారు?
ఎ) వేగాన్ని తగ్గించి ఆపడానికి సిద్ధంగా ఉంటారు.
బి) హరన్ వాయిస్తూ అదే వేగంతో వెళ్ళి పోతారు.
సి) హెడ్ లైట్లు, ఫ్లాష్ చేస్తూ అదే వేగంతో వెళ్ళిపోతారు.
డి) ఆగి, తొందరగా బంతి తీసుకొండని పిల్లలకు బుద్ధిచెబుతారు.