Indian Polity Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

962 total views , 1 views today

Q)1919 భారత ప్రభుత్వపు చట్టమునకు సంబంధించిన క్రింది ప్రవచనము లలో ఏది సరియైనది కాదు?

A)రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు లభించాయి.
B)రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటయింది.
C)సార్వజనిక ఓటు హక్కు గల్పించబడింది.
D)కేంద్రంలో రెండు సభలు గల శాసన సభ ఏర్పాటయింది.

View Answer
C)సార్వజనిక ఓటు హక్కు గల్పించబడింది.

Q)క్రింది వానిలో సరియైన ప్రకటనలు ఏవి?
1. లార్డ్ మోర్లే, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు
2. లార్డ్ మింటో, భారత గవర్నర్ జనరల్ గా ఉన్నారు.
3. లార్ మోర్లే, భారత గవర్నర్ జనరల్ గా ఉన్నారు.
4. లార్డ్ మింటో, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు

A)1&4
B)2&4
C)1&2
D)3&4

View Answer
C)1&2

Q)1919 భారత ప్రభుత్వ చట్టములో రిజల్ట అంశములలో లేని విషయము ఏది?

A)స్థానిక స్వపరిపాలన ప్రభుత్వము
B)పోలీసు
C)భూమి శిస్తు
D)న్యాయపాలన

View Answer
A)స్థానిక స్వపరిపాలన ప్రభుత్వము

Q)ఏ రాజ్యాంగ సవరణ అధికరణము 368లో పొందుపరిచిన విధముగా ప్రాథమిక హక్కులను సవరించవచ్చునని సూచనగా/పరోక్షంగా చెప్పినది?

A)25వది
B)24వది
C)29వది
D)42వది

View Answer
B)24వది

Q)రాష్ట్ర శాసన శాఖకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణింపుడు
1. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును.
2. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును మూడు నెలల వరకు ఆలస్యము చేయవచ్చును.
3. రెండవసారి శాసన మండలి సాధారణ బిలును పదిహేను రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
4. శాసన మండలి సాధారణ బిల్లు ఇరవై రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును.
క్రింది వాటిలో సరియైన జవాబును సూచింపుము

A)1,2&3
B)1,2,4
C)1,2,3,4
D)1&2

View Answer
A)1,2&3
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 × 2 =