115 total views , 10 views today
Paper 2 History Culture Geography TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers
TGPSC(TSPSC) Paper 1 History Culture Geography Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.
TGPSC GROUP 1 Mains
PAPER 2
History Culture Geography
SECTION – I/ విభాగం – I
1. Analyse the Stylistic and Iconographic differences between Gandhara and Mathura schools of art. గాంధార మరియు మథుర కళల మధ్య శైలీకృత (Stylistic) మరియు దృశ్య చిత్రాల (Iconographic) వ్యత్యాసాలను విశ్లేషించండి.
20. The major 19th Century tribal movements such as the Santhal Rebellion and the Munda Rebellion shaped the trajectory of Indian resistance against colonial rule. Discuss.
సంతాల్ తిరుగుబాటు మరియు ముండా తిరుగుబాటు వంటి 19వ శతాబ్దపు ప్రధాన గిరిజన ఉద్యమాలు వలసపాలనకు వ్యతిరేకంగా భారతీయ ప్రతిఘటన యొక్క మార్గాన్ని రూపొందించాయి. చర్చించుము.
3. (A)
Buddhism and Jainism gained wide acceptance due to the then prevailing socio-economic conditions in India. Analyse.
బౌద్ధ మరియు జైన మతాలు భారతదేశంలో అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా విస్తృత ఆమోదం పొందాయి. విశ్లేషించండి.
OR/లేదా
3. (B)
Indo-Islamic architecture is marked by awe-inspiring fusion of Hindu, Persian and Provincial Styles. Discuss with examples.
ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప కళ హిందూ, పర్షియన్ మరియు ప్రాంతీయ శైలుల అద్భుత విస్మయ కలయిక. ఉదాహరణలతో చర్చించండి.
4. (A)
The nature of British rule and colonial policies significantly altered after the 1857 revolt.
Discuss.
బ్రిటిషు పాలన స్వభావం మరియు వలసవాద విధానాలు 1857 తిరుగుబాటు తర్వాత గణనీయంగా మార్పు చెందాయి. చర్చించుము.
OR/లేదా
4. (B)
Peasants’ concerns were integral to the issues raised by the struggle for Indian independence. Illustrate with reference to the Bardoli Satyagraha.
భారత స్వాతంత్ర పోరాటంలో లేవనెత్తిన సమస్యలలో రైతుల ఆందోళనలు ఒక సమగ్రమైన భాగం. బార్డోలీ సత్యాగ్రహాన్ని ఉదహరిస్తూ వర్ణించుము.
5. (A)
‘Commercialisation of agriculture did not lead to improved technology in 19th century colonial India.’ Examine.
19 వ శతాబ్దం వలసవాద భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యీకరణ మైరుగైన సాంకేతికతకు దారి తీయలేదు. పరీక్షించుము.
OR/లేదా
5. (B)
Discuss the ideological differences between Gandhi and Ambedkar on Socio-Political issues and how the Poona Pact of 1932 showed the way.
సామాజిక-రాజకీయ సమస్యలపై గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య సైద్ధాంతిక విభేదాలను చర్చించుము మరియు 1932 పూనా ఒప్పందం ఏ విధంగా మార్గం చూపించింది.
SECTION – II/విభాగం – II
6.
Examine how the Qutub Shahi rulers laid the foundations for the emergence of composite culture in Golconda. Elucidate with specific examples.
గోల్కొండలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించడానికి కుతుబ్ షాహి పాలకులు ఏ విధంగా పునాది వేశారో పరీక్షించుము. స్పష్టమైన ఉదాహరణలతో వివరించుము.
7.
“Though Telangana Peasants’ Armed struggle was deemed to be the result of local causative factors, its ramifications were of national significance”. Justify.
“స్థానిక కారణాల’ ఫలితంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పటికి దాని పర్యవసానాలు జాతీయ ప్రాముఖ్యత వహించినవి” – సమర్థించుము.
8. (A)
Analyse the way in which the social and cultural life of the people evolved under Satavahanas and Ikshvakus.
శాతవాహనుల మరియు ఇక్ష్వాకుల కాలంలో ప్రజల సామాజిక మరియు సాంస్కృతిక జీవనం పరిణామం చెందిన విధానాన్ని విశ్లేషించుము.
OR/లేదా
8. (B)
“The Sammakka and Saralamma Jatara besides its established ritualistic practices, has been a powerful testimony to the tribal identity”. Comment.
“ఎంతో కాలంగా పాటిస్తున్న ఆచారాలు ఆచరణలో పెట్టడమే గాకుండా, సమ్మక్క – సారలమ్మ జాతర గిరిజనుల గుర్తింపుకు ఒక బలమైన సాక్ష్యం” – వ్యాఖ్యానించుము.
9. (A)
In the mid 19th century when British colonialism was at its height, how did Salar Jung as the Diwan of Hyderabad State played a dual role by appeasing the British on one side, and furthering the interests of the State, on the other?
బ్రిటిషు వలస పాలనా కాలం ఉచ్ఛ దశలో ఉన్న 19వ శతాబ్దం మధ్య భాగంలో హైదరాబాదు దివాన్గా సాలార్ జంగ్ ఒక ప్రక్క బ్రిటిషు వారిని మెప్పిస్తూ, ఇంకొక ప్రక్క రాజ్య హక్కులను కాపాడుతూ ద్వి పాత్రను ఎలా పోషించాడు ?
OR/లేదా
9. (B)
How was the growth and development of modern industries in Hyderabad State under the VI and VII Nizams intimately linked to the select social elite ?
ఆరవ మరియు ఏడవ నిజాంల కాలంలో అభివృద్ధి చెందిన నూతన పరిశ్రమలు ఏ విధంగా సామాజిక ఉన్నత వర్గంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవి ?
10. (A)
To what extent the Dalit movement in Hyderabad State strived for social upliftment and inculcate political consciousness?
హైదరాబాదు రాజ్యంలో దళిత ఉద్యమం ఏ మేరకు సామాజికోద్దరణ మరియు రాజకీయ చైతన్యాన్ని కల్పించగలిగింది ?
OR/లేదా
10. (B)
Assess the way Hyderabad State Congress under Swami Ramanand Tirtha chartered a course of action to transform the state from autocracy to integration.
స్వామి రామానంద తీర్థ హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ద్వారా రాజ్యాన్ని నిరంకుశత్వం నుండి ఏకీకరణ దిశగా పరివర్తన చేసేటందుకు రూపొందించిన ప్రణాళికను అంచనా వేయుము.
SECTION – III/విభాగం – III
11.
‘Strategies for management of rapid urban growth contribute to National and Regional economic growth’. Justify in the context of India’s Smart City Mission.
వేగవంతమైన పట్టణ వృద్ధి నిర్వహణ వ్యూహాలు జాతీయ మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి ? భారత స్మార్ట్ సిటీ మిషన్ నేపథ్యంలో దీనిని సమర్థించండి.
12.
Critically examine the impact of climate change on dry land agriculture in Telangana and suggest climate-resilient technologies to protect rain-fed cropping systems.
తెలంగాణ రాష్ట్రంలోని మెట్ట ప్రాంత వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి మరియు వర్షాధార పంటల వ్యవస్థలను రక్షించడానికి వాతావరణ మార్పులకు తట్టుకొనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సూచించండి.
13. (A)
Explain in detail the influence of locational aspects of Himalayas and Tibetan Plateau in the mechanism of Monsoons in india.
భారతదేశపు రుతుపవనాల నిర్మాణంలో, హిమాలయాలు మరియు టిబెట్ పీఠభూమి యొక్క స్థాన అంశాల ప్రభావాన్ని విపులంగా వివరించండి.
OR/లేదా
13. (B)
Assess the significance of mission Kakatiya programme of Telangana focussing clearly on its objectives target beneficiaries and benefits.
తెలంగాణా ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమము ముఖ్య ప్రాముఖ్యత దాని లక్ష్యాలు, లబ్దిదారులు మరియు ప్రయోజనాల దృష్ట్యా మదింపు చేయుము.
14. (A)
‘The institutional factors have control over the crop production in Indian Agriculture’. Examine.
‘భారతదేశ వ్యవసాయంలో పంట ఉత్పత్తిని సంస్థాగత అంశాలు నియంత్రిస్తాయి’ – దీని గురించి పరిశీలనాత్మకంగా వివరింపుము.
OR/లేదా
14. (B)
Critically analyse the role of Command Area Development Programme in alleviating regional inequalities in India.
భారతదేశపు ప్రాంతీయ అసమానతలను తగ్గించుటలో, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క పాత్రను విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
15. (A)
“The key to Hyderabad’s rapid economic growth is affordable and efficient Public transportation in the city”. Elaborate.
“హైదరాబాద్ యొక్క వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి కీలకం నగరంలో సరసమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ”. విశదీకరించండి.
OR/లేదా
15. (B)
Assess the potential of renewable energy resources of Telangana State and explain the constraints and opportunities in their utilisation with examples.
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని అంచనా వేయండి మరియు వాటిని ఉపయోగించుకోవడానికి ఉన్న అడ్డంకులను మరియు అవకాశాలను సోదాహరణంగా వివరించండి.
– O O O –
Group 1 General Essay Paper 1 | Group 1 papers | Group 1 Paper 3 |