74 total views , 1 views today
Paper 4 Economy and Development TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers
TGPSC(TSPSC) Paper 4 Economy and Development Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.
TGPSC GROUP 1 Mains
PAPER 4
Economy and Development
SECTION – I/ విభాగం – I
1.
How far has India achieved the policy target of doubling the farmers’ income by 2022 ? Examine.
2022 నాటికి భారతదేశంలో వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే విధానపరమైన లక్ష్యాన్ని ఏ మేరకు సాధించటం జరిగింది ? పరిశీలింపుము.
2.
“Replacement of the Planning Commission by NITI Aayog has changed the approach to development planning in India.” Explain.
“ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికా విధాన దృక్పథాన్ని మార్చివేసింది.” వివరింపుము.
3. (A)
“Human Poverty Index and capability approach are two ways to understand and measure poverty and well-being of people.” Explain in brief.
“మానవ పేదరిక సూచీ మరియు సామర్థ్య విధానం (capability approach) పేదరికాన్ని మరియు ప్రజా సంక్షేమాన్ని కొలవడానికి, అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలు.” క్లుప్తంగా వివరింపుము.
OR/ లేక
3. (B)
“Poverty reduction in different states of India has not been uniform during the post-economic reform period.” Examine.
“భారతదేశంలో ఆర్థిక సంస్కరణల తదనంతర కాలంలో వివిధ రాష్ట్రాలలో పేదరికం తగ్గింపు ఒకే తీరుగా లేదు.” పరిశీలింపుము.
4. (A)
What changes have been introduced in money supply measures as per the recommendations of the Working Group on Money Supply, 1998 chaired by Dr. Y.V. Reddy ?
డాక్టర్ వై.వి. రెడ్డి చైర్మన్ గా వ్యవహరించిన ద్రవ్య సప్లయ్పై వర్కింగ్ గ్రూప్, 1998 చేసిన సిఫారస్సుల మూలంగా ద్రవ్య సప్లయ్ కొలమానాలలో ఏ
విధమైన మార్పులు ప్రవేశ పెట్టటం జరిగింది ?
OR / లేక
4. (B)
Analyse briefly how Liquidity Adjustment Facility (LAF) in India emerged as an effective monetary policy instrument to control market fluctuations in the short run.
స్వల్ప కాలంలో మార్కెట్ హెచ్చు తగ్గులను నియంత్రించటానికి భారతదేశంలో ద్రవ్యత్వత సర్దుబాటు సౌకర్యం (Liquidity Adjustment Facility – LAF) ఏ విధంగా ఒక సమర్థవంతమైన ద్రవ్య విధాన సాధనంగా ఆవిర్భవించిందో సంక్షిప్తంగా విశ్లేషణ చేయుము.
5. (A)
Evaluate the innovativeness of the Fifteenth Finance Commission on Centre-State relations regarding the sharing of tax revenues.
పన్ను రాబడి పంపకాలకు సంబంధించి కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో 15వ ఆర్థిక సంఘం యొక్క వినూతనత్వాన్ని (innovativeness) మూల్యాంకనం చేయుము.
OR/ లేక
5. (B)
“Rising fiscal deficit during the 21st century has been, by and large, responsible for the surge in public debt for the Centre-States in India.” Examine.
“21 వ శతాబ్దంలో భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ ఋణం పెరగటానికి, మొత్తం మీద పెరుగుతున్న ద్రవ్య లోటు కారణమవుతుంది.” పరిశీలించుము.
SECTION II విభాగం II
6.
“The demographic structure and transition of Telangana deviated from the demographic structure and transition of India during 1961-2011” (as per census data). Examine with reference to sex ratio, rural-urban population, literacy and decadal growth rate of population.
“1961-2011 మధ్య భారతదేశపు జనాభా నిర్మితి మరియు పరివర్తనతో పోల్చినప్పుడు తెలంగాణ జనాభో నిర్మితి మరియు పరివర్తన వేరుగా ఉంది (జనాభా లెక్కల ప్రకారం).” లింగ నిష్పత్తి, గ్రామీణ-పట్టణ జనాభా, అక్షరాస్యత మరియు జనాభా దశాబ్ది వృద్ధి రేటు దృష్ట్యా పరిశీలించుము.
7.
“The land reforms in Telangana were aimed at redistributing the land from large farmers to agricultural labourers and landless poor.” Critically evaluate.
“పెద్ద వ్యవసాయదారుల నుండి వ్యవసాయ కూలీలకు మరియు భూమిలేని పేదలకు భూమిని పునఃపంపిణీ చేయడం తెలంగాణలో భూసంస్కరణలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.” విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేయుము.
8. (A)
“Structural changes are reflected in trends of sectoral shares in gross state value added (GSVA).” Examine this in the context of trends in GSVA of Telangana since 2014.
“స్థూల రాష్ట్ర విలువ మదింపులో (GSVA) రంగాల వాటా ధోరణులలో నిర్మాణాత్మక మార్పులు ప్రతిబింబిస్తాయి.” 2014 నుండి తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ మదింపుతో చోటు చేసుకున్న ధోరణుల దృష్ట్యా దీనిని పరిశీలింపుము.
OR/ లేక
8. (B)
“Telangana region in united Andhra Pradesh was not given due importance in allocation of funds by the successive governments during 1956–2014.” Critically analyse.
“1956–2014 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతానికి నిధుల కేటాయింపులో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు.” విమర్శనాత్మకంగా విశ్లేషించుము.
9. (A)
“Irrigation plays a crucial role in Telangana’s agricultural growth and food security.” Justify this in the context of sustained initiatives of the state government.
“తెలంగాణ వ్యవసాయ వృద్ధి మరియు ఆహార భద్రత విషయంలో నీటి పారుదల కీలకమైన పాత్రను పోషిస్తుంది.” రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా చేపడుతున్న కార్యక్రమాల దృష్ట్యా దీనిని సమర్థింపుము.
OR / లేక
9. (B)
“Timely and adequate availability of institutional agricultural credit to a large extent determines the production and productivity of crops.” Comment.
“సకాలంలో మరియు తగినంత సంస్థాగత వ్యవసాయ పరపతి లభ్యత చాలా ఎక్కువ మేరకు పంటల ఉత్పత్తిని మరియు ఉత్పాదకతను నిర్ణయిస్తాయి.” వ్యాఖ్యానించుము.
10. (A)
“Industrial policy, in general, determines the pace and pattern of industrialisation of a country/state.” Comment on this, keeping in view the Telangana State Industrial Project Approval and Self-Certification System (TS-iPASS).
“సాధారణంగా, పారిశ్రామిక విధానం దేశం రాష్ట్రం యొక్క పారిశ్రామికీకరణ వేగాన్ని, తీరును నిర్ణయిస్తుంది.” తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థను (TS-iPASS) దృష్టిలో పెట్టుకుని దీనిపై వ్యాఖ్యానించుము.
10. (B)
“Service sector as a whole and its sub-sectors have been contributing significantly to the overall performance of Telangana state since 2014.” Analyse.
“సేవా రంగం మొత్తంగా మరియు దాని ఉప రంగాలు 2014 నుండి తెలంగాణ రాష్ట్ర మొత్తం పనితీరుకు గణనీయంగా దోహదం చేస్తున్నాయి.” విశ్లేషించుము.
SECTION III
విభాగం III
11. Critically assess the challenges in aligning economic development with environmental sustainability in India in the present era.
ప్రస్తుత కాలంలో భారతదేశంలో పర్యావరణ సుస్థిరత్వంతో కూడిన ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎదురయ్యే సవాళ్ళను గురించి విమర్శనాత్మకంగా విశదీకరించుము.
12. How far have the measures taken by the government succeeded in successful management of solid waste in India? Explain.
భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో విజయవంతమవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంతమేరకు సప్లైలీకృతమయ్యాయి ? వివరించుము.
13. (A)
Examine the environmental implications of replacement of conventional fossil fuel-based power by green power.
సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత శక్తికి బదులుగా హరిత ఇంధనం (గ్రీన్ పవర్) ను ఉపయోగించడం వల్ల వచ్చే పర్యావరణ ఫలితాలను పరిశీలించుము.
OR / లేక
13. (B)
Assess the effectiveness of policies in India for land resources management.
భారతదేశంలో భూవనరుల శ్రీర్వహణ విధానాలు ఏ మేరకు ఆశించిన ఫలితాలను ఇచ్చాయో సమీక్షించుము.
14. (A)
Evaluate the effectiveness of current biodiversity conservation strategies implemented in India inconserving endangered species.
అంతరించిపోతున్న జాతులను పరిరక్షించటంలో ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ వ్యూహాల ప్రభావాన్ని మూల్యాంకనం చేయుము.
OR/ లేక
14. (B)
“Proper functioning of various components of eco-system is the basis for maintaining pollution-free environment.” Discuss.
“ఆవరణ వ్యవస్థ (eco-system) లోనివిధ భాగాల సరైన పనితీరు కాలుష్య రహిత పర్యావరణాన్ని కలిగి ఉండటానికి ఆధారం.” చర్చించుము.
15. (A)
Analyse the strengths and weaknesses of the Paris Agreement on climate change. How effective is Paris Agreement in addressing global warming ?
వాతావరణ మార్పుకు సంబంధించిన పారిస్ ఒప్పందపు బలాలను, బలహీనతలను విశ్లేషించుము. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) సమస్యను పరిష్కరించటంలో ఈ ఒప్పందం ఎంత ప్రభావవంతంగా ఉంది ?
OR/ లేక
15. (B)
“Kyoto Protocol played a crucial role in forcing participating countries to initiate measures to control greenhouse gases and protect the environment.” Examine.
“క్యోటో ప్రోటోకాల్ లో పాల్గొన్న దేశాలు పర్యావరణ పరిరక్షణ కొరకు హరిత గృహ వాయువులను (గ్రీన్ హౌస్ గ్యాసెస్) నియంత్రించే చర్యలు చేపట్టే విధంగా చూడటంలో క్యోటో ప్రోటోకాల్ కీలక పాత్ర పోషించింది.” పరిశీలన చేయుము.
– O O O –
Group 1 Paper 3 | Group 1 papers | Group 1 Paper 5 |