127 total views , 3 views today
Paper 6 Telangana Movement and State Formation TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers
TGPSC(TSPSC) Paper 6 Telangana Movement and State Formation Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.
TGPSC GROUP 1 Mains
PAPER 6
Telangana Movement and State Formation
SECTION – I/ విభాగం – I
1.
Examine the extent to which the Farman on Mulki Rules issued by the Nizam in 1919 were beneficial in matters of Education and Employment in the Hyderabad State.
1919 లో నిజాం ముల్కీ నిబంధనల పైన జారీ చేసిన ఫర్మాన్ (Farman) హైదరాబాదు రాజ్యంలో విద్య మరియు ఉపాధి రంగాలలో ఏ మేరకు ప్రయోజనకరమైనవో పరిశీలించుము.
2.
Give an account of the circumstances under which the Telangana Praja Samithi was formed and assess its work in the wake of Telangana movement.
తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దాని కృషిని అంచనా వేయుము.
3. (A)
“The unique geographical, political, social and economic features helped Telangana to assert its distinct cultural identity”. Discuss.
“తెలంగాణ యొక్క ప్రత్యేక భౌగోళిక, రాజకీయ, సాంఘిక మరియు ఆర్థిక లక్షణాలు తెలంగాణకు విస్పష్టమైన సాంస్కృతిక గుర్తింపు ధృడపరుచు కోనేందుకు సహకరించాయి”. చర్చించుము.
OR/లేదా
3. (B)
“The appointment of the States Reorganisation Commission (SRC) was in the backdrop of the growing demand for the establishment of Linguistic States in the Country” – Comment.
“రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్.ఆర్.సి.), భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపన కై దేశ వ్యాప్తంగా పెరిగిన ఆకాంక్షల నేపథ్యంలో నియమించబడింది” — వ్యాఖ్యానించుము.
4. (A)
“The safeguards given to Telangana in the ‘Gentlemen’s Agreement’ fulfilled the aspirations of the people”. Analyse.
“పెద్ద మనుషుల ఒప్పందం’లో తెలంగాణకు కల్పించబడిన రక్షణలు ప్రజల ఆకాంక్షలను సంతృప్తి పరిచింది. విపులీకరించుము”. విశ్లేషించుము.
OR/లేదా
4. (B)
“Telangana’s economic interests particularly in agriculture, irrigation and power were highly discriminated in the 1960s”. Examine.
“తెలంగాణ యొక్క ఆర్థిక అవసరాలు, ముఖ్యంగా వ్యవసాయం, నీటి పారుదల మరియు విద్యుత్ రంగాలు 1960 లలో చాల వివక్షతకు గురియైనవి”. పరిశీలించుము.
5. (A)
Discuss the role of students and employees in the origin of Telangana movement in 1969.
1969, తెలంగాణ ఉద్యమం ఆవిర్భావంలో విద్యార్థులు మరియు ఉద్యోగస్తుల పాత్రను చర్చించుము.
OR/లేదా
5. (B)
“The All Party Accord of 1969 reassured the promises of the people of Telangana through its provisions”. Analyse.
“1969 అఖిల పక్ష ఒప్పందం తన నిబంధనల ద్వారా తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను పునరుద్ఘాటించింది”. విశ్లేషించుము.
SECTION – II/విభాగం – II
6.
“The Six Point Formula imposed by the Government of India in 1973 satisfied neither Andhra nor Telangana.” Comment.
“1973 లో భారత ప్రభుత్వం విధించిన ఆరు సూత్రాల పథకం అటు ఆంధ్రను, ఇటు తెలంగాణను సంతృప్తి పరచలేదు”. వ్యాఖ్యానించుము.
7.
“The rise and spread of Naxalite Movement in Telangana led to the anti-landlord struggles”. Discuss.
“తెలంగాణలో నక్స్లైట్ ఉద్యమ ఆవిర్భావం మరియు వ్యాప్తి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు దారి తీసింది”. చర్చించుము.
8. (A)
Discuss the nature and purpose of Special Provisions made under Article 371D of the Indian Constitution in the context of Presidential Order.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D క్రింద చేసిన ప్రత్యేక నిబంధనల స్వభావము మరియు ఉద్దేశ్యాలను రాష్ట్రపతి ఉత్తర్వుల దృష్ట్యా చర్చించండి.
OR/లేదా
8. (B)
“Among the many issues, belittling the Telangana dialect and culture in the popular movies and electronic media was a strong factor that hurt the sentiments and self respect of the Telangana people”. Comment.
“జనాదరణ పొందిన సినిమాలు మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో తెలంగాణ మాండలికాన్ని మరియు సంస్కృతిని కించపరచడం ప్రజల మనోభావాలు మరియు ఆత్మగౌరవాన్ని గాయ పరచడం, ఇతర అంశాలతో పాటు ఒక బలమైన కారణం”. వ్యాఖ్యానించుము.
9. (A)
Examine, how by 1990s the regional disparities and imbalances in the State became clear in matters of political power, administration, education and employment.
1990 ల నాటికి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు మరియు అసమతుల్యతలు రాజకీయ అధికారం, పరిపాలన, విద్య మరియు ఉపాధి రంగాలలో ఏ విధంగా స్పష్టమైనవో పరిశీలించుము.
OR/లేదా
9. (B)
“The investments in Real Estate, Corporate Educational Institutions and Hospitals during 1980’s in Telangana was dominated by Andhra millioneers to the detriment of the locals”. Examine.
“1980 దశకంలో తెలంగాణలో స్థిరాస్తి రంగం, కార్పోరేట్ విద్యా సంస్థలు మరియు వైద్యశాలలో ఆంధ్ర లక్షాదికారుల పెట్టుబడులు అధిపత్యము స్థానికులకు హాని గలిగించింది”. పరిశీలించుము.
10. (A)
“By 1990s there was perceptible decline in the areas of agriculture and irrigation in Telangana”. Discuss.
1990 నాటికి తెలంగాణలో వ్యవసాయము మరియు నీటి పారుదల రంగాలలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుంది. చర్చించుము.
OR/లేదా
10. (B)
Discuss the efforts of Intellecutal and Political groups in search of Telangana identity.
తెలంగాణ గుర్తింపు (identity) అన్వేషణలో మేధావులు మరియు రాజకీయ బృందాల ప్రయత్నాలను చర్చించండి.
SECTION – III/విభాగం – III
11.
“The dynamics of cultural revivalism in Telangana after 1990 found expression in the demand for separate statehood”. Comment.
“ప్రత్యేక రాష్ట్రత్వం కోరిక (demand) లో, 1990 తర్వాత తెలంగాణలో కొనసాగిన సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్యానికి . భావం ఏర్పడింది”. వ్యాఖ్యానించుము.
12.
“Was the appointment of Sri Krishna Committee a meaningful exercise or a mere ploy to buy time” ? Comment in the light of its recommendations.
“శ్రీ కృష్ణ కమిటిని నియమించడం ఒక అర్థవంతమైన సాధన లేక సమయాన్ని వృథా చేయడానికి చేసిన కేవలం ఒక ఉపాయము మాత్రమా” ? దాని సిఫారస్సుల నేపథ్యంలో దీనిపై వ్యాఖ్యానించుము.
13. (A)
Critically assess the role of the main civil society organisations in Telangana in 1990s in articulating the cause of separate statehood.
1990 లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రత్వానికి దోహదపడిన ప్రధాన పౌర సమాత సంస్థల పాత్రను విమర్శనాత్మకంగా అంచనా వేయుము.
OR/లేదా
13. (B)
“The Girglani Committee appointed to study the issues of employees laid bare the large scale discrimination against Telangana”. Comment.
“ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేయడానికి నియమించబడిన గిర్ గ్లాని కమిటి తెలంగాణకు పెద్ద ఎత్తున జరిగిన విరక్షను బట్టబయలు చేసింది”. వ్యాఖ్యానించుము.
14. (A)
“The attempts to declare Hyderabad as ‘Free Zone’, evoked unprecedented agitations all over Telangana”. Elucidate.
“హైదరాబాదును “ఫ్రీ జోన్” గా ప్రకటించాలనే ప్రయత్నాలతో తెలంగాణ అంతటా అంతకు పూర్వము ఎప్పుడూ లేని విధంగా ఆందోళనలు కొనసాగాయి”. విశదీకరించుము.
OR/లేదా
14. (B)
Discuss the role of major political parties in the movement for separate Telangana State.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన రాజకీయ పార్టీల పాత్రను చర్చించండి.
15. (A)
Elucidate how the popular forms of protest like Million March, Sakala Janula Samme and others broadened the social base of the movement for separate state.
మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె మున్నగు ప్రజా ఆందోళనలు ఏ విధంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క పరిధిని విస్తృత పరచిందో వివరించుము.
OR/లేదా
15. (B)
“2009, December 9th Statement of the then Union Home Minister, Government of India on Telangana was a watershed event making the process of granting of statehood for Telangana as IRREVERSIBLE”- Discuss.
“భారత ప్రభుత్వానికి చెందిన అప్పటి కేంద్ర హోం మంత్రి తెలంగాణపై, 2009 డిసెంబరు 9న చేసిన ప్రకటన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తిరోగమనం లేని (IRREVERSIBLE) కీలక సంఘటనగా మలిచింది.” చర్చించుము.
– O O O –
Group 1 Paper 5 | Group 1 papers | Group 1 General English |