Q)“ఒక వ్యక్తి విజయానికి ప్రజ్ఞాలబ్ది (IQ) సగటు (సాధారణ) స్థాయిలో, భావోద్వేగ ప్రజ్ఞ హెచ్చు (ఉన్నత) స్థాయిలో ఉండాలనే సూత్రాన్ని” (ఫార్ములా) ఎవరు ప్రతిపాదించారు?
A)పీటర్ జేమ్స్
B)డేనియల్ గోల్ మాన్
C)విలియం బెల్
D)ధర్స్టన్
Q)ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి.
1. మన స్వీయ భావనలను, ఇతరుల భావనలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటం.
2. అమూర్తీకృత భావనలను అవగాహన చేసుకోలేని అసమర్థత.
3. గణిత సూత్రాలను అవగాహన చేసుకోగలిగే సామర్ధ్యత
4. సాంకేతికతను అవగాహన చేసుకోలేని అసమర్థత.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది / ఏవి ‘భావోద్వేగ ప్రజ్ఞ’ కల్లి ఉండటానికి సంబంధించినది?
A)1 మాత్రమే
B)2 మరియు 3
C)1 మరియు 4
D)4 మాత్రమే
Q)’స్వీయ అవగాహన మరియు సమర్థవంతమైన భావ ప్రసరణ కోసం, మానసిక మరియు భావోద్వేగ ప్రవర్తనా సరళులలో సరియైన అవగాహన ప్రజలో కల్పించుట కోసం’ రిచర్డ్ బ్యాండ్లర్ మరియు జాన్ గ్రిండర్ పెంపొందించిన సిస్టమ్ యొక్క పేరు ఏమిటి?
A)వ్యకిత్వము యొక్క ధృక్కోణాలు
B)న్యూరో లింగ్విస్తిక్ ప్రోగ్రామింగ్
C)సానుకూల ఆలోచన శక్తి.
D)వత్తిడిని తగ్గించే కార్యక్రమం
Q)సంతృప్తికరమైన వ్యక్తిగత మరియు వృత్తి జీవనానికి క్రింది నైపుణ్యముల లో ఏది అవసరము?
A)విద్యా నైపుణ్యము
B)సాంఘిక నైపుణ్యము
C)వృత్తి నైపుణ్యము
D)సాంకేతిక నైపుణ్యము
Q)ఈ క్రింది వాఖ్యలను చదవండి
1. వ్యక్తిగత విలువలు మన యొక్క వ్యకిత్వాన్ని నిర్ణయిస్తాయి.
2.ప్రేమించటం మరియు ప్రేమించబడటము అనేవి మానవుల ప్రాథమిక అవసరము
3. విలువల వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా మనుష్యులు విజయంతము అవటానికి ఉపయోగపడదు.
4. ఆధ్యాత్మికత విలువల వలన మనము మొత్తం మానవ జాతిని ప్రేమించి వారి బాగోగుల గురించి పాటుబడతాము.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది/ఏవి నిజము?
A)1 మరియు 2
B)1,2 మరియు 4
C)1,3 మరియు 4
D)2 మరియు 3
Q)ఈ క్రింది వాటిలో ఏది వృత్తి ధర్మము క్రిందకు వస్తుంది?
A)స్వలాభాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం
B)ఉద్యోగము పట్ల నిబద్ధత కల్గి ఉండటం
C)యజమానికి ఎల్లప్పుడూ మద్దతు నివ్వడం మాత్రమే
D)తోటి ఉద్యోగులకు సదా మద్దతు నివ్వడం మాత్రమే.