6) 82 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 335 వ అధికరణాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి కింది అధికారాన్ని ఇచ్చారు.
A) లోక్ సభలో ఆంగ్లో-ఇండియన్ ప్రజల ప్రాతినిధ్యం గురించి
B) ఏదైనా పోటీ పరీక్షలో కనీస అర్హత మార్కుల తగ్గింపు గురించి
C) లోక్ సభలో SC/ST లకు రిజర్వేషన్లు 70 సంవత్సరాల వరకు పెంచడం గురించి
D) దళిత క్రిస్టియన్లను షెడ్యూల్ తరగతుల జాబితాలో చేర్చడం గురించి
7) రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలను సరైన క్రమంలో పెట్టుము.
a.లౌకిక
b.ప్రజాస్వామ్య
c.గణతంత్ర
d.సామ్యవాద
e.సార్వభౌమ
A) d,b,a,e,c
B) e,d,a,b,c
C) a, b, d, c, e
D) c,d,b,a,e
8) క్రింది విధులను పరిగణించుము.
a.నూతన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కేంద్ర శాసన సభగా పనిచేయడం
b.రాజ్యాంగ రచనా ప్రక్రియను కొనసాగించి పూర్తి చేయడం
c.రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ గా వ్యవహరించడం.
పైన పేర్కొనబడిన విధులలో వేటిని భారత రాజ్యాంగ నిర్మాణ సభకు అప్పగించారు?
కోడులు:
A) a & b
B) b & c
C) c & a
D) a,b & c
9) భారత సుప్రీం కోర్టుకు సంబంధించి ఈ కింది వానిలో ఏ అంశాలు సరైనవి?
a.దీనికి భారతదేశంలోని ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ నుండి అయినా అప్పీలు స్వీకరించే అధికారం ఉంది.
b.రాష్ట్రపతి అడిగే ఏ వాస్తవ ప్రశ్న లేదా చట్టపరమైన అంశముల పైన అయినా సలహా పూర్వక అభిప్రాయాన్ని వెలిబుచ్చే అధికారం ఉంది.
c.న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీం కోర్టునకే గలదు.
d.భారత దేశంలోని అన్నీ ఇతర కోర్టులకు సుప్రీంకోర్టు న్యాయ పరిధి శిరోధార్యము.
కింద ఇచ్చిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
A) a & c
B) b & d
C) b,c & d
D) a,b & d
10) ఈ క్రింది వానిని జతపరుచుము.
లిస్ట్-I
లిస్ట్-II
a.ప్రకరణం 330
1.అంటరానితనం నిర్మూలన
b.ప్రకరణం 17
2.వ్యభిచార నిషేధం
c.ప్రకరణం 23
3.బాల కార్మికుల నిషేధం
d.ప్రకరణం 24
4.చట్ట సభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు
A) a-4,b-1,c-2,d-3
B) a-1,b-4,c-3,d-2
C) a-4,b-1,c-3,d-2
D) a-3,b-1,c-2,d-4
V good I want more