11) ఎన్నికల సంఘం విధులకు సంబంధించి వీటిని పరిశీలించి, కింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము.
a.ఎలెక్టోరల్ రోల్స్ ను రూపొందించడం
b.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించడం
c.లోక్ సభ స్పీకరు, రాజ్య సభ డిప్యూటీ ఛైర్మను పదవులకు ఎన్నికలు నిర్వహించడం
d.పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించడం
A) b,c,d సరైనవి a తప్పు
B) a,b,c సరైనవి d తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు
12) క్రింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీం కోర్టు తీర్పు ద్వారా తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి 15వ అధికరణంలో (4)వ క్లాజ్ ను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
A) స్టేట్ ఆఫ్ మద్రాస్ vs చంపకం దొరై రాజన్
B) ఇంద్ర సహానీ vs యూనియన్ ఆఫ్ ఇండియా
C) రాంసింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
D) ఎం.ఆర్.బాలాజీ vs స్టేట్ ఆఫ్ మైసూర్
13) ఈ కమిషనుల స్థాయికి సంబంధించి వీటిని గమనించి క్రింది కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.జాతీయ షెడ్యూలు కులాల కమీషన్: ఒక చట్ట సంస్థ
b.జాతీయ మహిళా కమీషన్: ఒక రాజ్యాంగ సంస్థ
c.జాతీయ షెడ్యూలు తెగల కమీషన్: ఒక రాజ్యాంగ సంస్థ
d.జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్: ఒక చట్ట సంస్థ
A) a,b సరైనవి c,d తప్పు
B) c,d సరైనవి a, b తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు
14) భారతదేశంలో అంతర-రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో సరైనది కాదు?
A) రాజ్యాంగంలోని 262వ అధికరణం ఈ అంశాన్ని నిర్ణయిస్తుంది.
B) సుప్రీం కోర్టు యొక్క పరిధిని ఈ అంశాన్ని సంబంధించి పూర్తిగా తీసివేసారు.
C) ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేయడంలో సుప్రీంకోర్టు కల్పించుకొనవచ్చును..
D) 262వ అధికరణం ప్రకారం అంతర-రాష్ట్ర జలాల వివాద చట్టం 1956ను చేసారు.
15) ప్రకరణ 248 ప్రకారం రాజ్యాంగం అవశిష్ట అధికారాలను పార్లమెంటుకు ఇచ్చింది ‘అశిష్ట అధికారాలు’ అనగానేమి?
A) మూడు జాబితాలలోని ఏ అంశంపైననైన చట్టాలు చేసే పార్లమెంటుకు ఉండే సుప్రీం పవర్
B) ఉమ్మడి జాబితాలోని అంశంపై రాష్ట్రం చేసిన చట్టంను పార్లమెంటు తిరస్కరించే అధికారం
C) ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంటు చట్టం చేసే ప్రత్యేక అధికారాలు
D) ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్ర శాసన సభలకు చట్టాలు చేసే ప్రత్యేక అధికారం
V good I want more