16) కింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్ర వెనుకబడిన తరగతుల జాబితాలో (OBC) చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది?
A) ట్రాన్స్ జెండర్లు
B) జాట్లు
C) ముస్లింలు
D) ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు
17) మునిసిపాలిటీ భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం ఎవరికి కలదు?
A) ముఖ్యమంత్రి
B) గవర్నరు
C) పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
D) ఎన్నికల కమీషను
18) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం (ఆర్టికల్) కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిస్తుంది.
A) ఆర్టికల్-366
B) ఆర్టికల్-335
C) ఆర్టికల్-341
D) ఆర్టికల్-338
a.మరణ శిక్ష విధించబడిన వాడిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
b.మరణ శిక్ష విధించబడిన వాడిని గవర్నర్ కూడా క్షమించవచ్చు.
c.మరణ శిక్ష విధించబడిన వాడిని గవర్నర్ క్షమించలేడు.
d.కోర్టు మార్షల్ ద్వారా శిక్షించబడిన వాడిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
A) a & b
B) a,c, & d
C) a,b, & d
D) a,b & c
20) ఇన్ఫర్మేషన్ టెక్నాలోజీ చట్టం, 2000లోని ప్రకరణ 66Aను సుప్రీం కోర్టు శ్రేయ సింఘాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ క్రింది ప్రాథమిక హక్కునకు భంగం వాటిల్లేదిగా ఉందని కొట్టివేసింది:
A) వాక్, భావ ప్రకటన స్వాతంత్య్రం
B) ఏ వృత్తినైనా, వ్యాపారంనైన చేసుకునే స్వాతంత్య్రం
C) విద్యా హక్కు
D) సమాచార హక్కు
V good I want more