26) ఈ క్రింది కమిటీలలో ఏది పార్లమెంటు స్థాయి కమిటీ కాదు?
A) ప్రభుత్వ ఖాతాల కమిటీ
B) అంచనాల కమిటీ
C) ప్రభుత్వరంగ సంస్థల కమిటీ
D) విత్త మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ
27) కోలీజియం పద్ధతి ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో వాడే MOP అనగా
A) మెమొరాండం ఆఫ్ ప్రిన్సిపుల్స్
B) మెమొరాండం ఆఫ్ ప్రెసిడెంట్స్
C) మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్
D) మెమొరాండం ఆఫ్ ప్రాసెస్
28) మునిసిపాలిటీలకు రాజ్యాంగంలోని 12వ షెడ్యూలులోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉన్నది. క్రింది వానిలో ఒకటి దానిలో భాగం కాదు:
A) భూ వినియోగ నియంత్రణ, భవనాల నిర్మాణం
B) గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా
C) తపాలా, టెలిగ్రాపులు, టెలిఫోనులు, వైర్లెస్, బ్రాడ్కాస్టింగ్, తదితర కమ్యూనికేషన్ సాధనాలు
D) ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
29) కింద పేర్కొనిన ఏ తీర్పులో ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన పట్ల న్యాయ సమీక్ష జరుపవచ్చని మొట్టమొదటగా సుప్రీంకోర్టు పేర్కొన్నది?
A) స్టేట్ ఆఫ్ రాజస్థాన్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (1977)
B) సుందర్ లాల్ పట్వా vs యూనియన్ ఆఫ్ ఇండియా (1993)
C) S.R. బొమ్మై vs యూనియన్ ఆఫ్ ఇండియా (1994)
D) రామేశ్వర్ ప్రసాద్ vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)
30) పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూలులోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉన్నది. క్రింది వానిలో ఒకటి దానిలో భాగం కాదు:
A) చిన్న నీటి పారుదల, నీటి వనరులపై అజామహిషి, వాటర్ షెడ్ అభివృద్ధి
B) సాంప్రదాయేతర ఇంధన వనరులు
C) అగ్నిమాపక సేవలు
D) టెక్నికల్ ట్రేనింగు, వొకేషనల్ విద్య
V good I want more