31) లోక్ సభచే ఆమోదించబడిన రాజ్యాంగం (122వ సవరణ) బిల్లు, 2014, ఈ క్రింది వానిలో దేనిని ప్రవేశ పెట్టాలని ఉద్దేశించినది?
A) జాతీయ న్యాయ నియామకాల కమీషన్ (NJAC)
B) కొన్ని కులాలను షెడ్యూలు కులాల జాబితాలోనికి చేర్చడం
C) వస్తువులు, సేవల పన్ను (GST)
D) హైదరాబాదు కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కర్నాటక గవర్నరుకు అధికారాలు ఇవ్వడం
32) ఈ మధ్య బాంబే హైకోర్టు ఈ కింది మతపరమైన సంస్థలలోనికి మహిళలకు ప్రవేశహక్కులు కల్పించింది?
A) హాజీ అలీ దర్గా
B) శని శింగనాపూర్ దేవాలయం
C) శబరిమల దేవాలయం
D) త్రయంబకేశ్వర్ దేవాలయం
33) 263వ ప్రకరణ రాష్ట్రాల మధ్య సంయమనం కొరకు ఒక అంతర్ రాష్ట్ర కౌన్సిలు ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. అంతర్ రాష్ట్ర కౌన్సిల్ విధులకు సంబంధించి వీటిని పరిశీలించి, క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.రాష్ట్రాల మధ్య తలయెత్తే తగదాలను విచారించడం, వాటిపై సలహాలు ఇవ్వడం
b.ఒకటి లేదా రెండు, కొన్ని లేదా అన్నీ రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి · గల అంశాలపై విచారణ, చర్చ చేయడం
c.విధాన రూపొందన, అమలుకు సంబంధించి ఏ అంశంపైన అయిన సరైన సంయమనం తెచ్చేందుకు సూచనలు చేయడం.
d.కౌన్సిల్ ఇచ్చిన తీర్పు అన్నీ రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
A) a,c,d సరైనవి b తప్పు
B) a,d సరైనవి b,c తప్పు
C) a,b సరైనవి c,d తప్పు
D) a,b,c సరైనవి d తప్పు
34) ఏదైనా రాష్ట్రానికి,ఆ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించవలసిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినపుడు, ఆ వివాద పరిష్కారానికి మధ్యవర్తిని ఎవరు నియమిస్తారు?
A) భారత రాష్ట్రపతి
B) భారత ప్రధాన మంత్రి
C) భారత ప్రధాన న్యాయమూర్తి
D) సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
35) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి వీటిలో ఏవి సరైనవి?
a.ప్రాథమిక విధులను రిట్ జురిస్ట్రిక్షన్ ద్వారా అమలు చేయవచ్చును.
b.ప్రాథమిక విధులు రాజ్యాంగం ఏర్పాటు మొదలు నుండి రాజ్యాంగములో భాగం
c.సర్వణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమైనాయి
d.ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి
కింది కోడుల ద్వారా సరైన జవాబును ఎంచుకొనుము.
A) a,b &c
B) a,b & d
C) b & c
D) c & d
V good I want more