41) స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని సమావేశాలు, ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు.
A) 10 సమావేశాలు, మొత్తం 220 రోజులు
B) 09 సమావేశాలు, మొత్తం 360 రోజులు
C) 12 సమావేశాలు, మొత్తం 245 రోజులు
D) 11 సమావేశాలు, మొత్తం 165 రోజులు
42) సుప్రీం కోర్టు ఇటీవలి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 రాజ్యాంగ బద్ధతను పునర్ సమీక్ష చేసేందుకు దానిని అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి పంపడానికి నిర్ణయించింది. ఇది ఏ అంశమునకు సంబంధించింది?
A) లెస్బియన్, గే, బై-సెక్యువల్, ట్రాన్స్-జెండర్ అంశాలు
B) భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలకు తరిలించే విభజన అంశాలు
C) వైట్ కాలర్ నేరాలకు సంబంధించిన అంశాలు
D) జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి కేసు
43) కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించి కింది లిస్ట్-Iను లిస్ట్- IIతో జతపరచి సరైన జవాబును సూచించండి.
లిస్ట్-I(రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం)
లిస్ట్-II(సంబంధిత అధికరణం)
a.జాతీయ శ్రేయస్సు కొరకు
1.అధికరణం 250
b.అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి
2.అధికరణం 252
c.రెండు లేదా అంతకుమించిన రాష్ట్రాల సమ్మతితో
3.అధికరణం 253
d.జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు
4.అధికరణం 249
5.అధికరణం 251
A) a-1,b-3,c-2,d-5
B) a-2,b-3,c-1,d-4
C) a-1,b-3,c-2,d-4
D) a-4,b-3,c-2,d-1
44) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ కింది రాజ్యాంగ సవరణల ద్వారా ప్రవేశపెట్టి తర్వాత సవరించారు
A) 52వ మరియు 91వ సవరణలు
B) 56వ మరియు 91వ సవరణలు
C) 52వ మరియు 93వ సవరణలు
D) 53వ మరియు 95వ సవరణలు
45) రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ భారత గణతంత్రాన్ని ‘రాష్ట్రాల కలయిక’ గా ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు?
A) భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినవి కాదు.
B) రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు ఉన్నది.
C) రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు లేదు.
D) ఈ రాష్ట్రాలు కలయికను ఇండియా అనగా భారతదేశంగా పిలుస్తారు.
V good I want more