TEACHING METHODOLOGY – SCIENCE Pedagogy DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

TEACHING METHODOLOGY – SCIENCE Pedagogy DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

These TEACHING METHODOLOGY – SCIENCE Pedagogy DSC 2012 SGT Previous Year Question Paper Andhra Pradesh (AP) are very important objective multiple choice questions for TET & TRT in Telangana, Andhra Pradesh based on D.Ed, B.Ed books and school books. This previous paper of TEACHING METHODOLOGY – SCIENCE Pedagogy SGT 2012 is very useful for students to get good score in TS TET, AP TET, TS TRT, AP TRT examination.
Included all topics like:


DSC
2012
Previous Year Question Paper With Answer Key

SCIENCE CONTENT PEDAGOGY TRT TET


PART-11
TEACHING METHODOLOGY – SCIENCE

149. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని బట్టి, విద్యార్థి విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని ఇలా అవగాహన చేసికొంటాడు.
శాస్త్రం =
A) పద్ధతులు + జ్ఞానం
B) ప్రక్రియ + ఫలితం
C) జ్ఞానం + జ్ఞానం సముపార్జించే మార్గం
D) శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ అభిరుచి + శాస్త్రీయ కార్యము
పై వానిలో సరికాని దానిని గుర్తించండి.
(1) A)
(2) B)
(3) C)
(4) D)

View Answer
(4) D)

150. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచనా సరం, ఓర్పు, సరియైన నిర్ణయాలు చేయడుం, నిశిత పరిశీలన వంటి కొన్ని సుగుణాలను పెంపొందిస్తుంది. దీనికి కారణమైన పద్ధతి, విలువను గుర్తించండి.
(1) అన్వేషణా పద్ధతి మరియు సృజనాత్మక విలువ
(2) ప్రకల్పనా పద్ధతి మరియు సాంఘిక విలువ
(3) సమస్యా పరిష్కార పద్ధతి మరియు నైతిక విలువ
(4) శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణా విలువ

View Answer
(4) శాస్త్రీయ పద్ధతి మరియు క్రమశిక్షణా విలువ

151. క్రింది వానిలో ఒకటి పాఠశాల వివిధ సబ్జక్టుల మధ్య సహసంబంధ ఆవశ్యకతకు ప్రమేయము లేనిది.
(1) పాఠ్య విషయాలు నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉంటుంది.
(2) అభ్యసన బదలాయింపు జరుగుతుంది
(3) ఉపాధ్యాయులకు శ్రమతో కూడుకున్నది
(4) జ్ఞానాన్ని సమైక్య పరుస్తుంది.

View Answer
(3) ఉపాధ్యాయులకు శ్రమతో కూడుకున్నది

152. ఉపాధ్యాయుడు అప్రమత్తంగా ఉండి, విజ్ఞాన శాస్త్ర బోధన – అభ్యసనలో పాఠశాల చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న వనరులను సమర్థవంతముగా ఉపయోగిస్తే, క్రింది వానిలో ఒకటి వర్తించదు.
(1) ధనంతో నిమిత్తం లేకుండా ఉత్తమ విజ్ఞాన శాస్త్ర విద్య విద్యార్థులకు అందించబడుతుంది.
(2) విజ్ఞాన శాస్త్రం మూర్త దశలో తీసుకు రాబడుతుంది.
(3) పాఠశాల, సమాజం సన్నిహితం చేయబడతాయి.
(4) ఏకమొత్త ఉపగమనం లోపించింది.

View Answer
(4) ఏకమొత్త ఉపగమనం లోపించింది.

153. ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తనా సామర్థ్యాలు ఆవశ్యకం. ఈ ప్రవర్తనా సామర్థ్యాలను వృద్ధి చేసే అభ్యసనానుభవాల సమూహమే
(1) జాతీయ పాఠ్యప్రణాళిక
(2) గూఢ పాఠ్య ప్రణాళిక
(3) రాష్ట్ర పాఠ్య ప్రణాళిక
(4) మూల పాఠ్యప్రణాళిక

View Answer
(4) మూల పాఠ్యప్రణాళిక

154. CBSE సూచించిన ప్రకారము క్రింది వానిలో ఒకటి CCE యొక్క లక్ష్యముగా పరిగణింపబడదు
(1) జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను అభివృద్ధి పరచుటకు సహాయపడును
(2) ఆలోచనా ప్రక్రియకు ప్రాముఖ్యత ఇచ్చుచూ, బట్టి స్మృతికి కూడా ప్రాముఖ్యత ఇచ్చును
(3) బోధనాభన్మన ప్రక్రియలో మూల్యాంకనమును అంతర్భాగముగా చేయును
(4) ఆశించిన ప్రమాణములో నిష్పాదన నిర్వహించుటకు మూల్యాంకనము ఒక గుణాత్మక నియంత్రణ యుక్తిగా ఉపయోగించును.

View Answer
(2) ఆలోచనా ప్రక్రియకు ప్రాముఖ్యత ఇచ్చుచూ, బట్టి స్మృతికి కూడా ప్రాముఖ్యత ఇచ్చును
Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!