Q)2012 డిసెంబరు 28వ తేదీ యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ విషయం గా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. క్రింద తెలిపిన పార్టీలు, వాటి నాయకులతో జతపరుచుము
జాబితా-1 (పార్టీలు) | జాబితా-2(నాయకులు) |
A)కాంగ్రెస్ | 1)కె.నారాయణ & గుండా మల్లేష్ |
B)వై.సి.పి. | 2)రాఘవులు & జూలకంటి రంగారెడ్డి |
C)సి.పి. ఐ | 3)మైసూరరెడ్డి & కె.కె.మహీంద్రరెడ్డి |
D)సి.పి.ఎం | 4)సురేష్ రెడ్డి & గాదె వెంకటరెడ్డి |
1.A-2, B-4, C-3, D-1
2.A-4, B-3, C-1, D-2
3.A-3, B-4, C-2, D-1
4.A-1, B-3, C-4, D-2
Q)1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాదు లోని 'గన్ పార్క్ స్మారక స్థూపాన్ని' రూపొందించిన శిల్పి ఎవరు?
A)పుష్పా నారాయణ
B)అంబటి సురేంద్ర రాజు
C)బి. వెంకట రమణా చారి
D)ఎక్కా యాదగిరిరావు
Q)ప్రతిపాదన (A): హైదరాబాదు నగర హోదాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందోత్సాహాలతో పరవశించారు.
కారణం(R) : 2009 అక్టోబర్ లో సుప్రీం కోర్టు హైదరాబాదు “ఫ్రీ జోన్” గా వుంటుందని తీర్పు ఇచ్చింది.
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R) (A)కు సరియైన వివరణ
B)(A)మరియు (R) రెండూ నిజముకాని (R)కు (A)సరియైనవివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)సన్సద్ యాత్ర ప్రధాన ఉద్దేశమేది?
A)ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లడం
B)పబ్లిక్ గార్డెన్స్ లోని అసెంబ్లీ భవనాన్ని ముట్టడి చేయడం
C)పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం
D)హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసానికి యాత్రగా వెళ్లడం
Q)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి, ఈ క్రింది వారిలో అధ్యక్షులు ఎవరు?
A)ప్రణబ్ ముఖర్జీ
B)మన్మో హన్ సింగ్
C)సోనియా గాంధీ
D)పి. చిదంబరం