TET Paper 1 and 2 Child Development and Pedagogy Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis

1153 total views , 1 views today

Q) “రాజ్యం-బలహీన వర్గాలు, ప్రత్యేకించి ఎస్.సి. మరియు ఎస్.టి లను విద్యలో, ఆర్థికంగా వృద్ధి చేయుటలో ప్రత్యేక శ్రద్ధవహించాలి, వారిని సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడి నుండి రక్షించాలి’ అని పేర్కొన్న రాజ్యాంగ అధికరణం?
A) 16
B) 15
C) 46
D) 21

View Answer
C) 46

Q) ‘విహారాలు’ దీనికి చెందిన విద్యాసంస్థలు?
A) జైనమతం
B) వేద అభ్యసనం
C) హిందూమతం
D) బౌద్ధ అభ్యసనం

View Answer
D) బౌద్ధ అభ్యసనం

Q) విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధనా మెళకువలలో ఒకటి?
A) సహకార పని
B) జట్టుపని
C) ప్రశ్న మరియు సమాధానమివ్వడం
D) మేధోమథనం

View Answer
D) మేధోమథనం

Q) ఒక సాంఘిక ఉప-వ్యవస్థగా, విద్య యొక్క ముఖ్య పాత్ర?
A) సమాజంలోని లోపాలను ఎత్తిచూపడం, సరిచేయడం
B) రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం
C) ప్రజలు శాంతియుత జీవనాన్ని గడుపుటకు తోడ్పడడం
D) సమాజంలో ఆధునికరణను ప్రవేశ పెట్టడం

View Answer
B) రాబోయే తరాలకు సాంఘిక విలువలు అందించడం

Q) జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం- 2005 ప్రకారం, దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ కింది వానిలో నొకటి అభిలషణీయమైన ఏర్పాటు?
A) కామన్ సిలబస్ (సాధారణ విషయం ప్రణాళిక)
B) సాధారణ పాఠశాల వ్యవస్థ
C) అన్ని రాష్ట్రాలలో హిందీని ఒక పాఠశాల విషయంగా చేయడం
D) ఆంగ్ల భాషా బోధనకు ప్రాధాన్యత

View Answer
B) సాధారణ పాఠశాల వ్యవస్థ

Q) తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానము, ఉపాధ్యాయునికి ఇందుకు ఉపయోగపడుతుంది?
A) విద్యార్థుల ఇంటిపనిని మూల్యాంకనం చేయుటకు
B) తరగతిలో క్రమశిక్షణను నిర్వహించుటకు
C) తరగతిలో ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసుకొనుటకు
D) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు

View Answer
D) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 + 12 =