11. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిశాలకోకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేసాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలనం రకం
a) నిరంతర పునర్బలనం
b) సొరకాల వ్యవధులలో పునర్బలనం
c) స్థిర నిష్పత్తులలో పునర్బలనం
d) చరశీల పునర్బలనం
12. ఒక విధ్యార్ధి న్యూటన్ సూత్రాలను ప్రయోగ పూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు, ఇక్కడ స్మృతి రకం
a) క్రియాత్మక స్మృతి
b) నిష్క్రియాత్మక స్మృతి
c) సంవేదన స్మృతి
d) బట్టి స్మృతి
13. ఎడ్గార్ డెల్ అనుభవాల శంఖువు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం
a) నాటకీకరణ అనుభవాలు
b) క్షేత్ర పర్యటనలు
c) టెలివిజన్ విద్య కార్యక్రమాలు
d) రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు
14. వికాసం, పరిపక్వత, అభ్యసనాలు, మధ్యగల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం
a) అభ్యసనం = f (పరిపక్వత X వికాసం)
b) వికాసం = f (పరిపక్వత / అభ్యసనం)
c) అభ్యసనం = f (పరిపక్వత / వికాసం)
d) వికాసం = f (పరిపక్వత X అభ్యసనం)
15. అభ్యసనం గురించి సరైన ప్రవచనం
a) అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు
b) అభ్యసనం ప్రవర్తనలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది
c) అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ
d) అభ్యసనం ఒక పరిమిత కాల ప్రక్రియ