PART-2
TELUGU CONTENT & METHODOLOGY
క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము
నిజామాబాదు లో జరిగిన ఆంధ్ర మహాసభలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తెలంగాణా ఆంధ్రప్రాంత ఏకీకరణకు తీర్మానం చేసింది. పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ ట్ కాంగ్రెస్ ‘ఘనపురం’ సమావేశంలో మరోసారి విశాలాంధ్ర నిర్ణయం ప్రకటించింది . విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశం 14 నవంబర్ 1953 నాడు హైదరాబాద్ లో జరిగింది. ఆహ్వాన సంఘ అధ్యక్షులు కొత్తూరు సీతయ్య , ప్రధాన కార్యదర్శిగా N. భోజరాజ్ వ్యవహరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన అయ్యదేవర కాళేశ్వర రావు విశాలాంధ్ర ఆవశ్యకతను వివరించారు. ఈ సభలో హైదరాబాద్ మంత్రులు పాల్గొనలేదు. గడియారం రామకృష్ణ శర్మ గారు స్వాగత పద్యాలు చదివారు. ఈ పద్యాలు గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డాయి. మూడు కోట్ల తెలుగు ప్రజలను ఒకటిగా ముడి వెయ్యాలని దాశరధి కవిత్వం రాసి తన కావ్యానికి మహాంధ్రదోయమని పేరు పెట్టారు.
31. విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశానికి అధ్యక్షత వహించినవారు
a) గడియారం రామకృష్ణ శర్మ
b) దాశరథి కృష్ణమాచార్యులు
c) కొత్తూరు సీతయ్య
d) అయ్యదేవర కాళేశ్వర రావు
32. విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశం ఎక్కడ జరిగింది?
a) నిజామాబాదు
b) ఘనపురం
c) హైదరాబాద్
d) వరంగల్లు
33. 1953 నాటికి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లోని తెలుగు ప్రజలెంతమంది ?
a) 2 కోట్లు
b) 3 కోట్ల
c) 4 కోట్లు
d) 5 కోట్లు
34. భారత ప్రభుత్వం హైదరాబాదు రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి చేపట్టిన చర్య
a) నిజామాబాదు లో తీర్మానం
b) ఘనపురం సమావేశం
c) స్థాయి సంఘ సమవేశం
d) పోలీస్ చర్య
35. గడియారం రామకృష్ణ శర్మ చే స్వాగత పద్యాలు చదువబడిన సమావేశం ?
a) నిజామాబాదు ఆంధ్రమహా సభ
b) హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఘనపురం సమావేశం
c) హైదరాబాదు విశాలాంధ్ర స్థాయి సంఘ సమావేశం
d) వరంగల్లు ఆంధ్ర మహాసభ