41. బతకమ్మ పండుగలో 8 వరోజు బతకమ్మ
a) అలిగిన బతకమ్మ
b) వెన్నముద్దల బతుకమ్మ
c) వాన బియ్యం బతుకమ్మ
d) సద్దుల బతుకమ్మ
42. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు అను సామెతకు అర్థం
a) వీర ప్రయత్నం
b) ఓటమి
c) ప్రయత్నానికి తగ్గ ఫలితం లేకుండుట
d) అల్ప ప్రయోజకమైన పని చేయుట
43. బాహ్య ప్రపంచం తెలియని వానిని గూర్చి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం
a) గాలిమేడలు
b) కళ్ళు నెత్తికెక్కు
c) కూపస్థ మండూకం
d) కాలికి బుద్ది చెప్పు
44. మాండలిక లక్షణం కానిది
a) న్యూన ప్రామాణికత ఉండదు
b) నిరీత ప్రాంతాల్లో మాత్రమే వ్యవహరించడం
c) క్రియా రూపాల్లో ప్రాంతీయ వైలక్షణం
d) గ్రంధస్థం అయి ఉండటం
45. ద్రుత ప్రకృతికం కానీ మాట ?
a) కంటె
b) బాలుడు
c) నేను
d) తాను