Q) క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.
కారే రాజులు ? రాజ్యముల్ గలుగనే గర్వోన్నతి బొందరే?
వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై
బేరైనం గలదే ? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు ? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!
పై పద్యంలో వక్త ఎవరు ?
A) వామనుడు
B) బలి చక్రవర్తి
C) వింధ్యావళి
D) శిబి చక్రవర్తి
Q) క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.
ఈ పద్యపాద గణాలు
A) మ-స-జ-స-త-త-గ
B) స-భ-ర-న-మ-య-వ
C) న-జ-భ-జ-జ-జ-ర
D) భ-ర-న-భ-భ-ర-వ
Q) క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.
‘భార్గవా’ అని బలి ఎవరిని సంబోధించారు?
A) శుక్రాచార్యుడు
B) వామనుడు
C) విరోచనుడు
D) ప్రహ్లాదుడు
Q) క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.
‘గర్వోన్నతి’ విడదీసి సంధిని తెల్పండి.
A) గర్వి + ఉన్నతి = ఇత్వ సంధి
B) గర్వ + ఔన్నత్యం = వృద్ధి సంధి
C) గర్వ + ఉన్నతి = గుణసంధి
D) గరువ + ఉన్నతి = యణాదేశ సంధి
Q) క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.
ఈ పద్యం ………… ప్రక్రియకు చెందింది.
A) ఇతిహాసం
B) ప్రబంధం
C) కథాకావ్యం
D) పురాణం