Q) క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించుము
1964లో కొఠారీ కమీషన్, ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు విధిగా హిందీ, ఇంగ్లీషు భాషలను అభ్యసించాలని ప్రతిపాదించింది. 1978లో NCERT వారు రూపొందించిన 10 + 2 + 3 విద్యా ప్రణాళికలో కూడా త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.
1986లో జాతీయ విద్యా విధానం (NPE – 1986) కూడా త్రిభాషా సూత్రానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో
1. మాతృభాష లేదా ప్రాంతీయ భాష
2 జాతీయ భాష – హిందీ
3. అంతర్జాతీయ భాష – ఇంగ్లీషులను అభ్యసించాలని సూచించింది. సమైక్యతా భావనకు ముఖ్యమైన కారణం త్రిభాషా సూత్రం. ఏ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రంలో “కూపస్థ మండూకాలుగా” ఉంటే దేశం చిన్నాభిన్నమైపోతుంది. డా|| విలియన్ అభిప్రాయం ప్రకారం బహుభాషాభ్యసనం విద్యార్థి బుద్ధిని ఇనుమడింపచేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరచి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసి సహృదయతను పెంపొందిస్తుంది. త్రిభాషా సూత్రాన్ని త్రికరణ శుద్ధితో అమలుపరిస్తే దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. జాతీయ స్ఫూర్తిని పెంపొందింపజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనదేశంలో ఒకటికన్నా ఎక్కువ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన మేధావులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పి.వి. నరసింహారావు 17 భాషలపై పట్టు సంపాదించి గొప్ప రాజనీతి తత్వవేత్తగా, బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు.
N.C.E.R.T ని విస్తరించండి.
A) నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎఫిషియన్సీ రీసెర్చ్ ట్రయినింగ్
B) నేషనల్ కో ఆపరేటివ్ ఎడ్యుకేషనల్ రీజనల్ ట్రయినింగ్
C) నేషనల్ కౌన్సిల్ ఫర్ రీడింగ్ టెక్నిక్స్
D) నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్
Q) త్రిభాషా సూత్రాన్ని అమలు పర్చడం వల్ల విద్యార్థికి మేలు జరుగుతుందని చెప్పిన భాషావేత్త?
A) డా|| విలియన్
B) డా॥ సెల్జియన్
C) డా|| బెల్జియన్
D) డా॥ సృజనకుమార్
Q) “కూపస్థ మండూకం”
A) సామెత
B) పొడుపు కథ
C) జాతీయం
D) దుష్టసమాసం
Q) త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఏది?
A) ఆంగ్లం
B) ఆంధ్రం
C) హింది
D) సంస్కృతం
Q) కొఠారీ కమీషన్ జాతీయ విద్యా విధానం?
A) 1985-1961
B) 1961-1985
C) 1986-1964
D) 1964-1986