Q) ‘పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం” వంటివి ఈ స్పృహకు చెందుతాయి.
A) నైతిక స్పృహ
B) సామాజిక స్పృహ
C) భాషాస్మృహ
D) ఆధ్యాత్మిక స్పృహ
Q) “దమ్మం” అను పదానికి ప్రకృతి
A) ధర్మం
B) ధార్మికం
C) దారవం
D) దమ్ము
Q) రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
A) జీవయాత్ర
B) యాత్రా రచన
C) జీవితచరిత్ర
D) వ్యాసం
Q) కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది
A) సి. నారాయణరెడ్డి
B) శ్రీరంగం శ్రీనివాసరావు
C) నండూరి రామమోహనరావు
D) నార్ల వెంకటేశ్వరరావు