111. దత్తాంశములోని వివిధ రాశులను వాటి పౌనఃపున్యములతో సూచించుటను ….. అంటారు.
1) పౌనఃపున్య విభాజన పట్టిక
2) తరగతులు
3) ఆరోహణ సంచిత పౌనఃపున్యము
4) ఏదీకాదు
112. దత్తాంశము నుండి పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయునపుడు ఉపయోగించు చిహ్నములను ఏమంటారు ?
1) పటచిహ్నాలు
2) బార్ చిహ్నాలు
3) గణన చిహ్నాలు
4) గీతలు
113. 20, 18, 37, 42, 3, 15, 15, 26 యొక్క వ్యాప్తి
1) 34
2) 37
3) 39
4) 42
114. ఒక వరుసలో గోపి ఎడమ నుండి 7వ వాడు. శంకర్ కుడి నుండి 5వ వారు. పరస్పరం స్థానాలు మార్చుకుంటే శంకర్ కుడి నుండి ఎనిమిదవ వాడు. అయిన వరుసలో ఎంతమంది వున్నారు?
1) 20
2) 12
3) 15
4) 14