146. పిల్లల భావాలకు ప్రాధాన్యతనిచ్చే కృత్యాలే అభ్యసనానికి మూలం
1) కిండర్ గార్డెన్ పద్ధతి
2) మాంటిసోరి పద్ధతి
3) ప్రశ్నాపద్ధతి
4) డ్యూయి పద్ధతి
147. ప్రస్తుత పాఠ్యపుస్తకాలు ఏ ఉపగమం ఆధారంగా రూపొందించబడ్డాయి
1) సమైక్యత ఉపగమం
2) సహసంబంధ ఉపగమం
3) ఇతివృత్త ఉపగమం
4) పైవన్నీ
148. అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారణీకరణాన్ని రూపొందించడం, సింహాలోకనం చేయడం, నియోజనాలు ఇవ్వడం అనే అంశాలు దాగి వుండే పాఠ్యపదక నిర్మాణకృత్యాలు ఏవి ?
1) పరిచయ కృత్యాలు
2) అభివృద్ధి కృత్యాలు
3) సమ్మిలిత కృత్యాలు
4) వికాసకృత్యాలు
149. విద్యార్థులు హైదరాబాద్ లోని చార్మినార్‌ను సందర్శించటం ద్వారా వారిలో కలిగే అనుభవం ఏది
1) కల్పితానుభవం
2) ప్రాతినిధ్యానుభవం
3) ప్రత్యక్షానుభవం
4) అపాధితానుభవం
150. రాజేష్ తను రాసిన ప్రశ్నాపత్రం సప్రమానత, విశ్వనీయత తగినట్లు ఉన్నాయో లేదో అంచనా వేయుటకు పూనుకొన్నాడు అయితే రాజేష్ తయారు చేసుకోవలసినవి
1) ప్రశ్నాపత్ర విశ్లేషణ
2) అంశవిశ్లేషణ
3) గణనసూచి
4) నీలినికష