26. (A+B)2 సూత్రాన్ని నేర్చుకున్న మాధురి (3+5)2 అను సమస్యను సాధించుటకు ఈ అభ్యసన బదలాయింపును సూచిస్తుంది.
1) సమరూప మూలకాలు
2) సామాన్యీకరణ
3) ఆదర్శాలు
4) సమగ్రాకృతి
27. ఈ క్రిందివానిలో సరైనది.
1) అవరోహణ వక్రరేఖను కుంభాకార వక్రరేఖ అంటారు.
2) ఆరోహణ వక్రరేఖను పుటాకార వక్రరేఖ అంటారు.
3) మిశ్రమ వక్రరేఖ యొక్క విస్తృత రూపంను లాక్షణిక అభ్యసన వక్రరేఖ అంటారు.
4) పైవన్నీ
28. ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లి దండ్రులు గానీ, ఇతరులు గానీ సంతృప్తిపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి
1) నమ్మకం – అపనమ్మకం
2) చొరవ – తప్పు చేసానన్న భావన
3) శ్రమించడం – న్యూనత
4) పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం
29. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా వుంటూ, ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉంటాయి.
1) ముఖాముఖి సమూహం
2) సహక్రియాత్మక సమూహం
3) ప్రాథమిక సమూహం
4) అదృశ్య సమూహం
30. నిర్మాణాత్మక మదింపునకు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం
1) 40%
2) 30%
3) 20%
4) 10%