56) “అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై, సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష”, అని నిర్వచించిన భాషావేత్త
A) స్టర్ట్ వర్ట్
B) హాకెట్
C) సఫైర్
D) జాన్.పి. హ్యూగ్స్
57) ప, ఫ, బ, భ, మ – అనే ధ్వనులు
A) ఓష్ఠ్యములు
B) దంత్యములు
C) తాలవ్యములు
D) కంఠ్యములు
58) సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యమ పద్ధతి – అని పిలువబడే ఆధునిక బోధన పద్ధతి
A) డాల్టన్ పద్ధతి
B) ప్రాజెక్టు పద్ధతి
C) సూక్ష్మ బోధన పద్ధతి
D) బృంద బోధన పద్ధతి
59) ప్లానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఫ్లాష్ కార్డులు, తోలు బొమ్మలు – ఈ రకమైన బోధనోపకరణాలు
A) శ్రవ్యోపకరణాలు
B) మాదిరి ఉపకరణాలు
C) దృశ్యోపకరణాలు
D) దృశ్య – శ్రవణ ఉపకరణాలు
60) తెలంగాణలో, ఒక విద్యా సంవత్సరంలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రహణాత్మక మదింపుల సంఖ్య
A) 1
B) 4
C) 3
D) 2