11) To know the general cognitive abilities of his students, a teacher shall use which of the following tests
తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి.
A) Interest Tests
అభిరుచి పరీక్షలు
B) Intelligence tests
ప్రజ్ఞా పరీక్షలు
C) Personality Tests
మూర్తిమత్వ పరీక్షలు
D) Attitude Tests
వైఖరి పరీక్షలు
12) A school has provided various activities, such as sports, drama, music, craft, debates etc. to the students mandating them to participate in at least two activities. The students have participated in their preferred activities. Participation in activities as per their preference indicates the students’
ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ, విద్యార్థులు ఏవైన రెండు కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది
A) achievement
సాధన
B) attitude
వైఖరి
C) interests
అభిరుచులు
D) performance
నిష్పాదన
13) Children belonging to this category of intellectual disability are incapable of managing life and need constant care for their entire life
బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించు కోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరం
A) Moderate
మధ్యస్థ
B) Mild
అల్ప
C) Borderline
బోర్డర్ లైన్
D) Profound
తీవ్ర
14) A teacher in a class studied the ‘impact of reward on performance of students’ on a group of students who were given rewards excluding other group who were not given reward. Identify the method employed by the teacher
ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి, బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహం పై ‘విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం’ అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి
A) Introspection
అంతఃపరిశీలన
B) Interview
పరిపృచ్ఛ
C) Experimental
ప్రయోగాత్మక
D) Participant Observation
భాగస్వామ్య పరిశీలన
15) From the following, identify the schools that need to teach considering the individual differences
కింది వాటి నుండి, వైయక్తిక భేదాలను పరిగణనలోకి తీసుకుని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి
A) Special Schools only
ప్రత్యేక పాఠశాలలు మాత్రమే
B) All Schools
అన్ని పాఠశాలలు
C) Government Residential Schools only
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే
D) Corporate Schools only
కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే