Telugu Content
31) కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి.
తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
దమకై యన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్ ?
పై పద్య రచయిత
A) తిక్కన
B) ఎర్రన
C) ఏనుగు లక్ష్మణకవి
D) శ్రీనాథుడు
32) సజ్జనులు ఎటువంటివారు
A) పక్కవారి పనిని చెడగొట్టువారు
B) పక్కవారిని పక్కదారి పట్టించేవారు.
C) తమ పని చేస్తూ పక్కవారికి సహాయం చేసేవారు
D) తమ పనిని పక్కన పెట్టి పక్కవారికి సహాయం చేసేవారు
33) దైత్యులు ఎటువంటి వారు
A) దేవతలతో సమానం
B) రాజులతో సమానం
C) తమ పనికై ఇతరుల పనికి ఆటంకం కలిగించేవారు
D) తమ పనిని పక్కన పెట్టేవారు
34) పై పద్యంలోని ఛందస్సు
A) శార్దూలం
B) మత్తేభం
C) ఉత్పలమాల
D) చంపకమాల
35) ‘హితార్థ’ – సంధి పేరు
A) సవర్ణదీర్ఘ సంధి
B) అత్త్వ సంధి
C) యణాదేశ సంధి
D) ఇ వృద్ధి సంధి