36) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
వ్యక్తి అంటే కేవలం శరీరం కాదు. మనసు, బుద్ధి, ప్రజ్ఞ, తేజస్సు మొదలైనవన్నీ కలిపితేనే మనిషి. ఈ శరీరం కన్నా మనం చాలా ఎక్కువ. అందుకే శరీరంపై వ్యామోహం పెంచుకోకూడదు. శరీరానికి ముఖ్యం అందం కాదు, ఆరోగ్యం. అందం అనేది మనసుకు సంబంధించినది, శరీరానికి సంబంధించినది కాదు. అలాగే మీరు అంటే మీ ఆలోచనలు, మీలో ఉన్న జీవత్వం అదే నిజం.
మన మనసు, బుద్ధి, ఆలోచనలు, మనకు ఉండే ప్రజ్ఞ లేక తేజస్సు తెలివి మొ||నవి మనకు ఒక గుర్తింపునిస్తాయి. ఇవే మనల్ని ఈ లోకంలో శాశ్వతుల్ని చేస్తాయి. శరీరం కాదు. కేవలం శరీర పరంగా, శరీరంపై వ్యామోహంతో జీవిస్తే అనేక కష్టాలు కలుగుతాయి. అందుకే శరీరంపై వెర్రి ప్రేమ ఉండరాదు. దేహమే నేను అనుకోరాదు. దేహాభిమానం తొలగాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. అయితే దేహారోగ్యమే అంతిమ లక్ష్యం కారాదు. దృఢమైన దేహం కూడా నశించేదే. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరో అడుగు ముందుకు వేసి దేశసేవ చేయాలి. దేశసేవ చేయడమే శరీరానికి అంతిమ లక్ష్యంగా ఉండాలి.
దేనిపై వ్యామోహం ఉండకూడదు
A) శరీరం
B) ಬುದ್ದಿ
C) జ్ఞానం
D) తేజస్సు
37) అందం దేనికి సంబంధించినది?
A) శరీరం
B) మనసు
C) చదువు
D) ఆస్తి
38) ‘మనం’ అంటే
A) మనలోని జీవత్వం
B) శరీరం
C) అందం
D) అలంకరణ
39) ఏది మనకు అంతిమ లక్ష్యం కావాలి
A) దేహంపై ప్రేమ
B) ఆస్తిపై వ్యామోహం
C) ఆరోగ్యం
D) దేశ సేవ
40) మనకు గుర్తింపునిచ్చేది ఏవి
A) అందం
B) ఐశ్వర్యం
C) ప్రజ్ఞ
D) ఆరోగ్యం