176. Which one of the following statements is not correct about Portuguese presence in India ?
(1) In 1498 Vasco-da-gama reached Calicut on the Malabar coast where he was received cordially by the Hindu Raja Zamorin.
(2) Francisco de Almeida, the first governor of the Portuguese in India followed a policy known as Blue Water Policy.
(3) Portuguese conquered Goa from Mysore rulers in 1510 and made it their capital.
(4) Alfonso de Albuquerque was the second Governor of Portuguese in India who tried to introduce reforms in the Hindu society by legally abolishing Sati.
భారతదేశంలో పోర్చుగీసు వారికి సంభందించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు?
(1) 1498 సంవత్సరంలో వాస్కోడగామా మలబార్ తీరంలోని కాలికట్ ను చేరగా అక్కడి హిందూ రాజు’ జామరిన్ ‘ ఇతన్ని సాధరంగా ఆదరించెను.
(2) భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నర్ అయిన ‘ఫ్రాన్సిస్కో డి అల్మిడా’ ‘బ్లూ వాటర్ విధానము’ అవలంబించెను.
(3) 1510 సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీసు వారు గోవాను జయించి దానినే తమ రాజధానిగా మార్చుకొనిరి.
(4) భారతదేశంలో పోర్చుగీసు వారి రెండవ గవర్నర్ గా నియమితుడైన ‘అల్ఫేంసో డి అల్బూకర్క్ చట్టబద్ధంగా ‘సతి’ని రద్దు చేయడము ద్వారా హిందూ సమాజంలో సంస్కరణములకు అంకురార్పణ గావించెను. ..
177. Which one of the following statements is not correct about Raja Ram Mohan Roy?
(1) He condemned the idol worship and Brahmanical rituals.
(2) He propagated Monothesim and stated that religion and divine worship mere personal matters of an individual and unjustly controlled by Priests.
(3) Tosupport his arguments, he depended upon Vedic and Puranic Literature.
(4) He wrote a pamphlet Anusthan’ prescribing the mode of worship to be followed in the Samaj.
ఈ క్రింది ప్రవచనములలో ఏది రాజా రామ్ మోహన్ రాయ్ కు సంభందించినంతవరకు సరి అయినది కాదు.
(1) అతడు విగ్రహారాధనను మరియు బ్రాహ్మణులు కొనసాగించే వివిధ ఆచారాలను ఖండించెను.
(2) మతము మరియు భగవంతుని ఆరాధన వ్యక్తి యొక్క స్వకీయమైన విషయమని కాని పూజారి వర్గం దీన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని ఆరోపిస్తూ ఏకేశ్వరోపాసనను ప్రచారము చేసెను.
(3) తన వాదనల యొక్క ప్రామాణికత కొరకు వేదములు మరియు పురాణ సాహిత్యంపై ఆధారపడెను.
(4) బ్రహ్మసమాజంలో భగవంతుని ఆరాధన ఏ పద్ధతిలో ఉండాలో తెలియ చెప్పేందుకు ‘అనుష్టాన్’ అనే లఘు పుస్తకాన్ని రచించెను.
178. Which one of the following opinions on the nature of 1857 Mutiny is not correct ?
(1) John Seeley: “The Revolt of 1857 as a wholly unpatriotic and selfish sepoy mutiny with no native leadership and no popular support”.
(2) James Outram & W. Tayler: “The outbreak of 1857 mutiny as a result of Hindu – Muslim conspiracy”.
(3) R.C. Majumdar: “1857 Sepoy mutiny was not a war of Independence. There is nothing in the conduct or behaviour of the sepoys which would justify us in the belief or assumption, that they were inspired by love for their country or fought against the British with the definite idea of freeing their motherland”.
(4) William Darlymple: “It is a conflict between civilization and Barbarism”.
1857 సిపాయిల తిరుగుబాటు స్వబావముపై ఈ క్రింది అభిప్రాయములలో ఏది సరి అయినది కాదు?
(1) జాన్ సీలే :”1857 తిరుగుబాటు దేశభక్తి లేని, స్వార్థపూరిత సిపాయిల తిరుగుబాటు అని దీనికి దేశీయుల నాయకత్వము కాని ప్రజాదరణగాని లేవు”.
(2) జేమ్స్ ఔత్రాం మరియు డబ్లు.టేలర్: “1857 తిరుగుబాటు హిందూ ముస్లింల యొక్క కుట్ర పర్యవసానమే”.
(3) ఆర్. సీ. మజుందార్: “1857 సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర్య పోరాటం కాదు. ఇందులో పాల్గొన్న సిపాయిల . ప్రవర్తన గాని వారికి తమ దేశం పట్ల ప్రేమగాని, మాతృభూమి విముక్తికై బ్రిటిష్ వారితో పోరాడినట్లు కాని మనకు గోచరించదు”.
(4) విలియం డార్లింపుల్: “నాగరికత మరియు అనాగరితకు మద్య జరిగిన సంఘర్షణే 1857 తిరుగుబాటు”.
179. Arrange the following Political Associations chronologically based on their inception.
(a) Indian Association
(b) Poona SarvajanikSabha
(c) Madras Mahajana Sabha
(d) Bombay Presidency Association
ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణముగా అమర్చుము.
(a) ఇండియన్ అసోసియేషన్
(b) పూనా సార్వజనిక సభ
(c) మద్రాసు మహాజన సభ
(a) బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్
180. Who among the following is not associated with defence of the ‘Indian National Army’ prisoners in the year 1945-46?
(1) Bhulabhai Desai
(2) Jawaharlal Nehru
(3) Mahadev Desai
(4) Asaf Ali
ఈ క్రింది వారిలో ఎవరు1945-46నాటి ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ఖైధీల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కాదు.
(1) భూలాభాయి దేశాయి
(2) జవహర్ లాల్ నెహ్రూ
(3) మహదేవ దేశాయి
(4) ఆసఫ్ అలీ