Q)భారతదేశంలో ప్రధాన భౌగోళిక విభజనలు
A)హిమాలయాలు, గంగా-సిందూనది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి,తీరప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు.
B)అడవులు, నదులు, పర్వతాలు మరియు సముద్రతీరాలు
C)హిమాలయాలు మరియు ఎడారులు
D)29 రాష్ట్రాలు మాత్రమే
Q)ఎన్నికల సంఘానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను చదవండి.
1. భారత ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019లో సునీల్ చంద్రను ఎన్నికల కమిషనర్గా నియమించాడు.
2. భారత రాజ్యాంగపు ప్రకరణం 324 యొక్క క్లాజ్ 2 కింది ఎన్నికల కమీషనర్ నియామకం జరుగుతుంది.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మాత్రమే సరియైనది
B)2 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండూ సరియైనవి
D)1 మరియు 2 రెండూ సరియైనవి కావు
Q)సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) చెందిన వారికి పది (10)శాతం ఆర్ధిక రిజర్వేషన్లను జనవరి 2019లో ఏ చట్టం ప్రకారం అమలులోకి తెచ్చారు?
A)రాజ్యాంగం (ఒక వంద మూడవ సవరణ) చట్టం
B)రాజ్యాంగం (ఒక వంద రెండవ సవరణ) చట్టం
C)రాజ్యాంగం (ఒక వంద ఒకటవ సవరణ) చట్టం
D)రాజ్యాంగం (ఒక వంద ఇరవై రెండవ సవరణ) చట్టం
Q)కింది పేర్కొన్న పదవులను వాటికి నియమించబడిన వ్యక్తుల పేర్లతో జతపరచండి (మార్చి 2019 నాటికి)
సంస్థ మరియు హోదా | వ్యక్తపేరు |
A)ప్రధాన ఎన్నికల అధికారి | 1)రంజన్ గోగోయ్ |
B)భారత ప్రధానన్యాయమూర్తి(CJI) | 2)రిషి కుమార్ శుక్ల |
C)సి.బి.ఐ. డైరెక్టర్ | 3)కె.వి. చౌదరి |
D)కేంద్ర విజిలెన్స్ కమిషనర్ | 4) దీపక్ మిశ్ర |
5)సునీల్ అరోరా |
1.A-5, B-4, C-3, D-2
2.A-5, B-1, C-2, D-3
3.A-3, B-4, C-2, D-5
4.A-2, B-1, C-5, D-3
Q)కేంద్ర క్యాబినెట్ చేత ఏర్పాటు చేయబడిన వస్తు సేవల పన్ను అప్పిలేటు – ట్రిబ్యునల్ యొక్క జాతీయ బెంచ్ అనేది.
1. వస్తు సేవల పన్ను నిబంధనలలో మొదటి అప్పీలు ఫోరం(వేదిక)
2. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారాల ఉమ్మడి వేదిక
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మాత్రమే సరియైనది
B)2 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండూ సరియైనవి
D)1 మరియు 2 రెండూ సరియైనవి కావు.