Q)1924 సంవత్సరంలో రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయబడింది. అట్టి వేర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది?
A)మెక్ లిగాన్ కమిటీ
B)ఆక్వర్త్ కమిటీ
C)నికోల్సన్ కమిటీ
D)రాబర్ట్సన్ కమిటీ
Q)1919 భారత ప్రభుత్వపు చట్టమునకు సంబంధించిన క్రింది ప్రవచనము లలో ఏది సరియైనది కాదు?
A)రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు లభించాయి.
B)రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటయింది.
C)సార్వజనిక ఓటు హక్కు గల్పించబడింది.
D)కేంద్రంలో రెండు సభలు గల శాసన సభ ఏర్పాటయింది.
Q)క్రింది వానిలో సరియైన ప్రకటనలు ఏవి?
1. లార్డ్ మోర్లే, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు
2. లార్డ్ మింటో, భారత గవర్నర్ జనరల్ గా ఉన్నారు.
3. లార్ మోర్లే, భారత గవర్నర్ జనరల్ గా ఉన్నారు.
4. లార్డ్ మింటో, బ్రిటీష్ ప్రభుత్వంలో భారత రాజ్య సచివుడు
A)1&4
B)2&4
C)1&2
D)3&4
Q)1919 భారత ప్రభుత్వ చట్టములో రిజల్ట అంశములలో లేని విషయము ఏది?
A)స్థానిక స్వపరిపాలన ప్రభుత్వము
B)పోలీసు
C)భూమి శిస్తు
D)న్యాయపాలన
Q)ఏ రాజ్యాంగ సవరణ అధికరణము 368లో పొందుపరిచిన విధముగా ప్రాథమిక హక్కులను సవరించవచ్చునని సూచనగా/పరోక్షంగా చెప్పినది?
A)25వది
B)24వది
C)29వది
D)42వది