Q)క్రింది వాటిలో ఏది ఏవి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ (Ministry of Skill Developmet and Entrepreneurship (MSDE) లక్ష్యం/లక్ష్యాలు?
1. Skill India పథకపు దార్శనికత (vision) ను పూర్తిచేయుట
2. సప్లయ్ వైపునకు సంబంధించిన నైపుణ్యంగల శ్రామిక శక్తి గణాంకాలను నిర్వహించుట.
3. నైపుణ్యం గల శ్రామిక శక్తి డిమాండ్-సప్ల మధ్య ఉండే అంతరాన్ని పూరించుట.
సరియైన సమాధానం
A)1,2 మరియు 3 సరైనవి
B)1 మరియు 2 మాత్రమే సరైనవి
C)2 మరియు 3 మాత్రమే సరైనవి
D)1 మరియు 3మాత్రమే సరైనవి
Q)జతపరుచుము
జాబితా-1(పథకము) | జాబితా-2(లక్ష్యం ) |
A)ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) | 1) పేదవారికి సంస్థల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను కల్పించుట. |
B)ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (PMRY) | 2)నగదు బహుమతులు కల్పించుట ద్వారా యువతలో నైపుణ్యాభి వృద్ధిని ప్రోత్సహించుట. |
C)దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (DDGKY) | 3)భారతదేశ జనాభా మిగులును,జనాభా డివిడెండ్ గాల మార్చుట |
D)ఆజీవిక | 4)ఒక మిలియన్ అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన |
1.A-2, B-1, C-3, D-4
2.A-4, B-2, C-1, D-3
3.A-2, B-4, C-3, D-1
4.A-3, B-2, C-4, D-1
Q)దోమ కాటు వల్ల మలేరియా వస్తుంది అన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ క్రింది ఇవ్వబడిన దోమలలో ఏది మలేరియా రావడానికి కారణం?
A)మగ అనోఫిలిస్ దోమ
B)మగ క్యూలెక్స్ దోమ.
C)ఆడ అనాఫిలిస్ దోమ
D)ఆడ క్యూలెక్స్ దోమ
Q)వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను పోలిన కారకాలను వాక్సిన్లు కలిగి ఉంటాయి. బలహీనమైన లేక చనిపోయిన సూక్ష్మజీవులు లేక వాటి ఉత్పాదకాల నుండి వాక్సిన్ను తయారు చేస్తారు. రేబిస్ వ్యాధికి వాక్సినను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
A)లూయిస్ పాశ్చర్
B)ఎడ్వర్డ్ జెన్నర్
C)జోనాస్ సాక్.
D)ఆల్బర్ట్ సాబిన్
Q)కండరాల నియంత్రిత చలనాలను అనుసంధానించే మెదడు భాగానికి గల పేరు
A)అనుమస్తిష్కం
B)మస్తిష్కం
C)మజ్ఞాముఖం
D)హైపోథాలమస్