Q)క్రింది ప్రవచనాలను చదవండి
1. సీసం (lead)లాంటి కాలుష్యాలు ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయిలో చేరి సాంద్రీకృతం అయ్యే విధానాన్ని బయోఅక్యుమలేషన్ అంటారు.
2. ఉప్పునీటి (marine) ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తీదారుల జీవద్రవ్యరాశి ప్రథమ వినియోగదారుల జీవ ద్రవ్యరాశి కంటే తక్కువ.
3. ఒక పోషక స్థాయి నుండి తర్వాతి పోషక స్థాయికి శక్తి ప్రసారం జరిగేటప్పుడు కొంత శక్తి వృధా అవుతుంది.
పై ప్రవచనాలలో ఏది/ఏవి సరియైనవి?
A)1 మరియు 2
B)2 మరియు 3
C)1 మరియు 3
D)3 మాత్రమే
Q)భూగోళ తాపం (గ్లోబల్ వార్నింగ్) అనేది సమకాలీన పర్యావరణ సమస్య. ఈ సమస్యకు దోహదపడే వాయువుల సమూహము
A)మిథేన్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్
B)మీథేన్, హైడ్రోజన్, నైట్రోజన్
C)మీథేన్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఓజోన్
D)నైట్రోజన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్
Q)క్రింది పదార్థాలలో విలక్షణమైన స్వభావము ప్రదర్శించు ఫెర్రో ఆయస్కాంత పదార్ధ మేది?
A)మాంగనీస్
B)అల్యూమినియం
C)బిస్మత్
D)ఇనుము
Q)ఒక నిర్దిష్టమైన దిశలో వస్తువు ప్రయాణించిన అతి తక్కువ దూరం
A)వడి
B)స్థాన భ్రంశము
C)వేగము
D)త్వరణం
Q)ఒక విద్యుద్వలయంలో విద్యుత్ ప్యూజ్ వాడకం వల్ల కలిగే ప్రయోజనము
A)విద్యుద్వలయాన్ని మూయుటకు లేదా తెరచుటకు
B)విద్యుద్వలయాన్ని అధిక విద్యుత్ ప్రవాహాల నుండి రక్షించుటకు
C)విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చుటకు
D)వలయంలో విద్యుచ్ఛక్తి వినియోగము తగ్గించుటకు