Q)హైపోకి సంబంధించినంతవరకు, కింది వాటిలో సరియైన వ్యాఖ్య ఏది?
1. దీనిని ఫోటోగ్రఫీలో వాడతారు. 2. దీనిని ఆంటి గా వాడతారు.
3. దీనిని యాంటీ సెప్టిక్ గా వాడతారు . 4. దీనిని కృత్రిమ సిల్క్ తయారీలో వాడతారు.
A)2,3,4
B)1,3,4
C)1,2,4
D)1,2,3
Q)ప్రతిపాదన (A) : గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు సాధారణంగా ద్రవరూపం లో ఉంటాయి.
కారణం(R) : నూనెలు అసంతృప్తి కొవ్వు ఆమ్లాలను కల్గి ఉంటాయి.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (A)కు (R) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (A) కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)కాంకర్’ వ్యాధి వల్ల నిమ్మ పండ్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. నిమ్మ తోటలు పెంచే వ్యవసాయదారులు ఈ వ్యాధి వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతారు. ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది?
A)వైరస్
B)బాక్టీరియా
C)శిలీంధ్రం
D)నిమటోడ్
Q)’అత్తిపత్తి’ ఆకులను ముట్టుకొన్నప్పుడు జరిగే చలనం క్రింది వాటిలో దేనికి ఉదాహరణ?
A)అనుకుంచిత చలనం
B)అనువర్తన చలనం
C)అనుచలనం
D)నర్కేడియన్ రిథమ్
Q)ప్రతిపాదన (A) : పండడం కోసం పచ్చి మామిడికాయ లుంచిన బుట్టలో పూర్తిగా పండిన ఒక మామిడికాయను ఉంచితే, ఆ బుట్టలోని అన్ని కాయలు త్వరితగతిన పండుతాయి.
కారణం(R) : పూర్తిగా పండిన మామిడికాయ నుండి విడుదల అయ్యే ఎథిలీన్ మిగిలిన కాయలలో ఎఫిలిన్ ఉత్పత్తిని ప్రేరేపింపచేసే పక్వతను ‘త్వరితగతం చేస్తుంది.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ సరియైనవి. మరియు (A)కు (R) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ సరియైనవి కాని (A) కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని (R) సరియైనది కాదు.
D)(A) సరియైనది కాదు, కాని (R) సరియైనది.