Q)క్రింది ప్రవచనాలను చదవండి
1. తీపి బఠాణీ మొక్కలో మెండెల్ ప్రయోగాలలో ఏక సంకరణ జన్యు 1 రూప నిష్పత్తి 1:2:1
2. చిన్న జనాభాలో జన్యు పౌనఃపున్యంలోని మార్పులను ‘జన్యు విస్థాపనం’ అంటారు.
3. జనకుల నుండి లక్షణాలు సంతతికి అందించబడటాన్ని ‘అనువంశికత’ అంటారు.
పై ప్రవచనములలో ఏది/ఏవి నిజం?
A)1 మరియు 3
B)2 మరియు 3
C)1 మాత్రమే.
D)1,2 మరియు 3
Q)“ప్రపంచీకరణ ప్రక్రియ” కు ప్రధాన కారణము
A)సందేశాత్మక సినిమాలు
B)వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం
C)ధనికులు మరియు పేదవారికి మధ్య ఉన్న అంతర్యం
D)రాజకీయ పార్టీలు
Q)సానుభూతికి మరియు పరానుభూతికి ఉన్న తేడా ఏమి?
A)సానుభూతి అనుకూలమైనది, పరానుభూతి ప్రతికూలమైనది .
B)సానుభూతి అంటే ఎదుటివారి భావాల్ని వారి దృష్టి కోణం నుండి చూసి అర్థం చేసుకోవటం, పరానుభూతి అంటే వేరేవాళ్ళ దుర దృష్టాన్ని చూసి దయ, జాలి చూపటం
C)సానుభూతి అంటే వేరే వాళ్ళ యొక్క దురదృష్టాన్ని చూసి దయ, జాలి చూపటం, పరానుభూతి అంటే ఎదుటి వారి భావాల్ని వారి దృష్టి కోణం నుండి చూసి అర్థం చేసుకోవటం .
D)సానుభూతి క్రియ మరియు పరానుభూతి సముచ్చయము
Q)ఈ క్రింది వారిలో ఏ కారణముల వలన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో అమ్మాయిలకంటే అబ్బాయిలే కావాలి అని ఎక్కువమంది కోరుకుంటారు?
A)ప్రభుత్వ విధానాలు కారణంగా
B)కొడుకులు కూతుళ్ళకన్న అందంగా ఉంటారని
C)కూతుళ్ళకు వరకట్నాలు ఇవ్వాల్సి వస్తుందని
D)కూతుళ్ళు స్వర్గానికి మార్గాలు వేస్తారు.
Q)’వర్టికల్ సోషల్ మొబిలిటి’ అంటే ……
A)ప్రజల యొక్క వలసలు
B)మత మార్పిడి
C)కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటము
D)వ్యక్తి జనం లేదా సమూహాలు ఒక సదా నుండి మరొక హదాకు మారడం.