Q)సంతృప్తికరమైన వ్యక్తిగత మరియు వృత్తి జీవనానికి క్రింది నైపుణ్యముల లో ఏది అవసరము?
A)విద్యా నైపుణ్యము
B)సాంఘిక నైపుణ్యము
C)వృత్తి నైపుణ్యము
D)సాంకేతిక నైపుణ్యము
Q)ఈ క్రింది వాఖ్యలను చదవండి
1. వ్యక్తిగత విలువలు మన యొక్క వ్యకిత్వాన్ని నిర్ణయిస్తాయి.
2.ప్రేమించటం మరియు ప్రేమించబడటము అనేవి మానవుల ప్రాథమిక అవసరము
3. విలువల వ్యవస్థ అనేది ఎప్పుడూ కూడా మనుష్యులు విజయంతము అవటానికి ఉపయోగపడదు.
4. ఆధ్యాత్మికత విలువల వలన మనము మొత్తం మానవ జాతిని ప్రేమించి వారి బాగోగుల గురించి పాటుబడతాము.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది/ఏవి నిజము?
A)1 మరియు 2
B)1,2 మరియు 4
C)1,3 మరియు 4
D)2 మరియు 3
Q)ఈ క్రింది వాటిలో ఏది వృత్తి ధర్మము క్రిందకు వస్తుంది?
A)స్వలాభాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం
B)ఉద్యోగము పట్ల నిబద్ధత కల్గి ఉండటం
C)యజమానికి ఎల్లప్పుడూ మద్దతు నివ్వడం మాత్రమే
D)తోటి ఉద్యోగులకు సదా మద్దతు నివ్వడం మాత్రమే.
Q)జి (G) 20 సదస్సులు జరగాల్సిన ఆతిథ్య దేశాలను అవి జరిగిన సంవత్సరాలతో జతపరచండి.
జాబితా-1 (సదస్సు సం||) | జాబితా-2 (ఆతిథ్య దేశం) |
A)2019 | 1)భారతదేశం |
B)2020 | 2)జపాన్ |
C)2018 | 3)సౌది అరేబియా |
D)2022 | 4)అర్జెంటీనా |
1.A-1, B-3, C-2, D-4
2.A-2, B-3, C-4, D-1
3.A-4, B-2, C-3, D-1
4.A-2, B-4, C-1, D-3
Q)క్రింది వ్యాఖ్యలను చదవండి.
1. థాయిలాండ్ ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో తీసుకున్న నిర్ణయం ప్రకారం థాయిలాండ్ యొక్క జాతీయ జల జంతువు సియమీస్ పోరు చేప (war fish)
2. థాయిలాండ్ యొక్క అధికారిక జాతీయ జంతువు పులి.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మరియు 2 రెండూ సరియైనవి.
B)1 మరియు 2 రెండూ సరియైనవి కావు
C)1 మాత్రమే సరియైనది.
D)2 మాత్రమే సరియైనది.