Q)అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనరుగా నియమించి, తెలంగాణకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనము చేయమన్నాడు?
A)నీటిపారుదల సౌకర్యాలు
B)పారిశ్రామిక అభివృద్ధి
C)ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు
D)దేవాలయ భూముల వినియోగం
Q)ఈ క్రింది వారిలో పార్లమెంటులో “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013″ ను ప్రవేశపెట్టినదెవరు?
A)మన్మో హన్ సింగ్
B)పి. చిదంబరం
C)సుషీల్ కుమార్ షిండే
D)ఎ.కె. ఆంధోని
Q)క్రింది ప్రవచనములలో ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, నకు సంబంధించి సరైనది ఏది?
A)రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నరు ఉండుట
B)3వ అధికరణంలో తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఉండుట
C)ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఉండుట
D)ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు జిల్లా సరిహద్దులు మార్చు కోవటానికి అధికారం ఉండుట
Q)1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజా సమితి ఉపాధ్యాక్షులు ఎవరు?
A)కొండా లక్ష్మణ బాపూజీ
B)సదాలక్ష్మి
C)మదన్ మోహన్
D)సుమిత్రా దేవి
Q)క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది?
A)ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీ నిబంధన కొనసాగింపు.
B)తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో వ్యవసాయ భూములు అమ్మకం.
C)విద్యాసంస్థల్లో, తెలంగాణ విద్యార్థులకు 3:1 నిష్పత్తిలో స్థానాలకేటాయింపు
D)తెలంగాణ ప్రాంతంలో వచ్చే అధిక ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికే వినియోగించాలి.