Q)క్రింది ప్రవచనములలో అక్బరు మత విధానమునకు సంబంధించి ఏది సరియైనది కాదు?
A)అతని తల్లితండ్రులు తన మతపరమైన ఆలోచలను చాలా వరకు ప్రభావితం చేసారు.
B)అతని సంరక్షణ కర్తయైన బైరం ఖాన్ అతని మత విధానమును ప్రభావితం చేయగలిగెను.
C)తన మత సామరస్య విధానమును తీవ్రవాదులైన ఇస్లాం మత పెద్దలు గూడ అభిమానించిరి.
D)తన హిందూ భార్యలు అతడు అనుసరించిన మత విధానముపై గొప్ప ప్రభావం చూపిరి.
Q)వాస్తు కళారీత్యా అత్యంత పరిపూర్ణమైనదిగా గుర్తింపు పొందిన బులంద్ దర్వాజ ఏ మొగల్ చక్రవర్తి తన దక్కన్ దందయాత్రల విజయ సూచకముగా నిర్మించెను?
A)బాబరు
B)హుమయున్
C)అక్బర్
D)ఔరంగజేబు
Q)”హిందూమతమనే క్షేత్రంలో భారతదేశపుమూలాలుధృడంగా పాతుకు పోయినాయి. దానికి విఘాతం గలిగించిన,భూమిలో నుండి పెకలించబడిన చెట్టువలె నశించు పోవును” అని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు చెప్పారు?
A)స్వామి వివేకనంద
B)స్వామి దయానంద సరస్వతి
C)అనిబిసెంటు
D)ఆత్మారం పాండురంగ
Q)ఈ క్రింది నవలను వాటి రచయితతో జతపరుచుము
జాబితా-1 (నవల) | జాబితా-2(రచయిత) |
A)ఇందులేఖ | 1)దేవకి నందన్ ఖత్రి |
B)గోదాన్ | 2)రొకెయ హుస్సెన్ |
C)చంద్రకాంత | 3)ప్రేమ్ చంద్ |
D)సుల్తానాస్ డ్రీం | 4)చందు మీనన్ |
1.A-2, B-4, C-3, D-1
2.A-1, B-3, C-4, D-2
3.A-4, B-1, C-3, D-2
4.A-4, B-3, C-1, D-2
Q)క్రింది గాంధీ జరిపిన తొలి సత్యాగ్రహ ఉద్యమాలను అచ్చట ఎదుర్కొన్న సమస్యలతో జతపరుచుము.
జాబితా-1(ప్రాంతాలు) | జాబితా-2(సమస్యలు) |
A)దర్బా న్ | 1)నీలి మందు సాగులోని తీంకాతియా పద్దతి |
B)చంపరాన్ | 2)జాతి వివక్షత |
C)అహమ్మదాబాదు | 3)రైతుల అణచివేత |
D)ఖేడ (కైర) | 4)మిల్లు కార్మికుల స్ట్రెకు |
1.A-2, B-1, C-3, D-4
2.A-2, B-1, C-4, D-3
3.A-4, B-2, C-3, D-1
4.A-1, B-3, C-4, D-2