TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

61) భారతదేశంలో ప్రస్తుతం మూడు బంగారు గనులు పని చేస్తున్నాయి. వాటిలో ఒకటి

A) సింగ్రా, పశ్చిమ బెంగాల్
B) సాంగ్లి, మహారాష్ట్ర
C) హీరాబుద్ధిని, జార్ఖండ్
D) కోలార్, కర్ణాటక

View Answer
C) హీరాబుద్ధిని, జార్ఖండ్

62) ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం చందాల కేశవదాసు 140వ జన్మదినాన్ని జరుపుకుంది. ఆయన

A) మొదటి తెలుగు సినిమా గేయ రచయిత.
B) తెలంగాణ మొట్టమొదటి లఘు కథా రచయిత.
C) మొట్టమొదటి పేరిణీ శివతాండవ నృత్యకారుడు.
D) తెలంగాణ నుండి మొట్టమొదటి సినిమా కళాకారుడు

View Answer
A) మొదటి తెలుగు సినిమా గేయ రచయిత.

63) వ్యాపారాత్మకంగా గర్భాన్ని అద్దెకివ్వడాన్ని నిరోధించడానికి ఈ మధ్య కేంద్ర మంత్రివర్గ సర్రోగసీ నియంత్రణ బిల్లు-2016కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు సంబంధించి కింది వాటిలో ఏది/ఏవి సరైనవి.
(a).ఇది మన దేశంలో సర్రోగసీని నిషేధిస్తుంది
(b).ఇది వ్యాపారాత్మక సర్రోగసీని, దానికి సంబంధించిన మానవ పిండాలను అమ్మడం మరియు కొనడాన్ని నిషేధిస్తుంది.
(c).కొన్ని నిబంధనలకు లోబడి ఇది నైతికపరమైన సర్రోగసీని పిల్లలు లేని తల్లిదండ్రుల కొరకు అనుమతి ఇస్తుంది.
(d).ఇది విదేశీయులు, స్వలింగ సంపర్కజంటలు, పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న జంటలు మరియు ఒంటరిగా ఉంటున్న వ్యక్తులు సర్రోగసీ ద్వారా పిల్లల్ని కనడాన్ని నిషేదిస్తుంది.

A) c మాత్రమే
B) c మరియు d
C) a మాత్రమే
D) b మాత్రమే

View Answer
B) c మరియు d

64) ప్రసిద్ధ ఉర్దూ మరియు పర్షియన్ కవి అయాన మీర్జా గాలిబ్ ఎవరికి సమకాలికుడు?

A) జహంగీర్
B) అక్బర్
C) బహదూర్ షా జఫర్
D) ఔరంగజేబ్

View Answer
C) బహదూర్ షా జఫర్

65) పశ్చిమ కనుమల శిఖరాలు ఈ రకపు మృత్తికలతో ఆవరింపబడి ఉన్నాయి?

A) అటవీ మృత్తికలు
B) ఎర్ర మృత్తికలు
C) పర్వతీయ మృత్తికలు
D) లేటరైట్ మృత్తికలు

View Answer
D) లేటరైట్ మృత్తికలు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 ⁄ 7 =