71) బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టాన్ని 2016వ సంవత్సరంలో సవరించి బాల కార్మిక వ్యవస్థను ఈ కింది వృత్తులలో తప్ప అన్నింటిలోనూ రద్దు చేసారు.
A) గృహ అవసరాలకు సంబంధించిన పని.
B) ఇటుక బట్టీలలో పని చేయడం.
C) బాలురు తమ కుటుంబానికి కుటుంబ వ్యాపారానికి సంబంధించి ప్రమాదకరమైన పనుల్లో తప్ప ఇతర పనులలో సహాయం చేయడం.
D) నిర్మాణ రంగం
72) భారతదేశం 1975లో కాస్మోస్ ద్వారా రష్యా నుండి రోదసీలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరు
A) రోహిణి
B) ఆర్యభట్ట
C) భాస్కర
D) వరాహమిహిర
73) Which of the following is the nearest meaning of the word ‘IMMINENT’ ?
A) Being important for a long time
B) Likely to happen very soon
C) Intermediary
D) Immediately
74) ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపథంలో ఉంది?
A) అస్మక
B) పాంచాల
C) అంగ
D) కురు
75) బెజవాడ విల్సనక్కు రామన్ మెగసెసె అవార్డు ఈ కింది రంగంలో చేసిన కృషికి లభించింది.
A) మహిళలను అక్రమ రవాణా నుండి రక్షించడం
B) పర్యావరణ పరిరక్షణ
C) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
D) చేతుల ద్వారా మనుషుల మల విసర్జనను శుభ్రం చేసే ప్రక్రియను అంతమొందించడం.