76) ఒక గడియారంలో 24 గంటల సమయంలో ఎన్నిసార్లు గంటల ముల్లు మరియు నిమిషాల ముల్లు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి?
A) 24
B) 23
C) 21
D) 22
77) ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం దేనితో సంబంధం కలిగి ఉంది?
A) వన్య ప్రాణులు
B) సీతాకోక చిలుకలు
C) ఔషధ మొక్కలు
D) పక్షులు
78) అభివృద్ధి కార్యక్రమాలు విపత్తు ముప్పునకు దోహదం చేస్తాయనే వాదాన్ని ఎదుర్కొనేందుకు ఒక పద్ధతి:
A) వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం
B) విపత్తు ముప్పు ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది ముఖ్యమని ప్రచారం చేయడం
C) అభివృద్ధికారక కార్యక్రమాలను తగ్గించడం.
D) విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను ప్రధాన స్రవంతితో జతపరచడం
79) తెలంగాణకు సంబంధించి మొట్టమొదటగా వాలీబాల్ క్రీడలో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును పొందిన మహిళా క్రీడాకారిణి
A) జి. ముళినీ రెడ్డి
B) జరీనా బేగం
C) ఎం. సుజాత రెడ్డి
D) యు. మాధవి రెడ్డి
80) క్రింది పేర్కొన్న దేశాలలో ఏ దేశానికి / దేశాలకు అణు ఇంధన సరఫరా కూటమి (న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్)లో సభ్యత్వం ఉంది?
a.చైనా b.ఇండియా c.ఇరాన్ d.పాకిస్తాన్ e.ఇజ్రాయిల్
A) a మాత్రమే
B) c మరియు e మాత్రమే
C) a, b, c మరియు d
D) a, c, d మరియు e