126) క్రింద ఇచ్చిన నంబర్ సిరీస్ ను పరిశీలించండి. 111తో ప్రారంభమై 201తో అంతమయ్యే ఈ సిరీస్లో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి?
111, 114, 117, 120, ……….201
A) 32
B) 33
C) 30
D) 31
127) సూచనలు: ఈ ప్రశ్నలో రెండు ప్రకటనలు (Statements) మరియు నాలుగు నిర్ణయాలు (Conclusions) ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ ప్రకటనలను పూర్తి నిజంగా భావిస్తూ ఏ నిర్ణయాలు ప్రకటన ఆధారంగా మరియు తర్కబద్ధంగా చేయబడినవో గుర్తించండి.
ప్రకటనలు:
(A) అన్ని సింహాలు కుక్కలు
(B) కొన్ని కుక్కలు పులులు
నిర్ణయాలు:
(I) కొన్ని సింహాలు పులులు.
(II) కొన్ని కుక్కలు సింహాలు.
(III) ఏ సింహం కూడా పులి కాదు.
(IV) అన్ని కుక్కలు సింహాలు.
A) నిర్ణయం (II) మరియు (I) లేదా (III) మాత్రమే
B) అన్ని నిర్ణయాలు
C) నిర్ణయం (I) మరియు (II) మాత్రమే
D) నిర్ణయం (I) మరియు (IV) మాత్రమే
128) “ప్రధానమంత్రి జన ఔషధి యోజన (పి.ఎం.జె.వె.వై)”కు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము:
(a).2008లో ప్రారంభించిన ఈ పథకం, జెనెరిక్ మందులు ఔట్లెట్లను ప్రారంభించాలని చెపుతుంది.
(b).భారత ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదలకు, బలహీన వర్గాలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులను అందజేయడం.
(C) .ఈ మధ్య కాలంలో 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 437 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రారంభించింది.
పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది/ఏవి నిజం?
A) a & c
B) a, b & c
C) a మాత్రమే
D) a & b
129) సింధూ నదీ జలాల ఒప్పందం (IWT) ప్రకారం భారతదేశానికి ఈ కింది నదులపై పూర్తి హక్కులు ఇచ్చినారు.
(a).చీనాబ్
(b).రావి
(c).బియాస్
(d).సింధూ
(e).సట్లెజ్
(f).జీలం
ఈ క్రింది కోడ్ల ద్వారా సరైన జవాబును ఎంచుకొనుము.
A) b, c మరియు e మాత్రమే
B) a, b మరియు f మాత్రమే
C) a, b, మరియు c మాత్రమే
D) a, c, మరియు d మాత్రమే
130) 21వ భారత లా కమిషన్ మొదటి అధ్యక్షులు ఎవరు?
A) జస్టిస్ డి.కె. జైన్
B) జస్టిస్ మదన్ బి. లోకుర్
C) జస్టిస్ బి. ఎస్. చౌహాన్
D) జస్టిస్ ఎ.పి.షా