46) కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు?
A) షా ముబారక్
B) షా ఖిలాదార్
C) షా బందర్
D) షా ఇన్సాఫ్
47) తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమము
A) తుడుం దెబ్బ
B) మాదిగ దండోరా
C) సంగరా భేరి
D) గొల్ల కురుమ డోలు దెబ్బ
48) ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింద ఇవ్వబడిన అధికరణములను (లిస్ట్-I),వాటిని Part-IVలో చేర్చిన రాజ్యాంగ సవరణలను (లిస్ట్- II) జతపరిచి సరైన కోడ్ ను సూచించుము.
లిస్ట్-I(అధికరణం)
లిస్ట్-II(రాజ్యాంగ సవరణ)
a.అధికరణం 39-A
1.44వ సవరణ
b.నూతన అధికరణం 45
2.42వ సవరణ
c.అధికరణం 43-B
3.86వ సవరణ
d.అధికరణం 48-A
4.97వ సవరణ
5.95వ సవరణ
A) a-1,b-2,c-4,d-5
B) a-2,b-3,c-4,d-2
C) a-3,b-2,c-4,d-3
D) a-1,b-2,c-5,d-3
49) “రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజల, అతి ముఖ్యంగా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, విద్యా, ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహనికి, వారిని సాంఘిక అన్యాయం, అన్ని రకాల దోపిడుల నుండి రక్షించడానికి పాటుపడుతుంది”. ఈ అంశం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కలదు?
A) ప్రాథమిక హక్కులు
B) ఆదేశిక సూత్రాలు
C) ప్రాథమిక విధులు
D) సమానత్వపు హక్కు
50) నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ కింది వాటిలో దేనికి సంబంధించినవి?
A) అవి భారత ఉపఖండంలోని మూడు ప్రధాన వర్ణ సమూహాలు
B) అవి మూడు ప్రధాన భాషా డివిజన్లు
C) అవి మూడు వివిధ రకాలైన ప్రజలు ఉపయోగించే వాద్య పరికరాలు
D) అవి మూడు దేవాలయ వాస్తు శిల్ప శైలులు.